బిజినెస్

ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌నగర్: నాలుగున్నరేళ్ల క్రితం మూతపడిన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో గురువారం సాయంత్రం ఉత్పత్తి ప్రారంభం కావడంతో కాగజ్‌నగర్‌కు పూర్వ వైభవం వచ్చి మళ్లీ కళకళలాడే రోజులు వచ్చాయి. నాలుగన్నరేళ్లుగా పట్టణ ప్రజలు, కార్మికులు నిరీక్షిస్తున్న కళ నెరవేరడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. పాత యాజమాన్యం అప్పుల భారంతో మిల్లును 2014 సెప్టెంబర్ 27న తాత్కాలిక షట్‌డౌన్ పేరుతో మూత వేసినప్పటి నుంచి మిల్లు పునరుద్దరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అప్పడు కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మిల్లును పునఃప్రారంభించేందుకు వివిధ పేపర్ మిల్లు యజామాన్యాలతో సంప్రదింపులు జరుపడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి వివిధ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడటం జరిగింది. మిల్లు పునరుద్దరణకు ముందుకు వచ్చిన జెకె మిల్లుకు ప్రభుత్వం తరుపున అన్ని రాయితీలు కల్పిస్తామని గత సంవత్సరం మార్చి 18న ప్రభుత్వం జీవో సైతం జారీ చేసింది. దేశంలో పేపర్ ఉత్పత్తిలో మంచి పేరున్న జెకె యాజమాన్యం అప్పటి ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటి ఆర్‌తో ఆగస్టు 2న మిల్లులో పూజా కార్యక్రమాలు నిర్వహించి మిల్లును ప్రారంభించింది. అప్పటి నుంచి మిల్లులో మరమ్మత్తులు చేస్తూ మొదటగా 7వ నెంబర్ పేపర్ మిషన్ ద్వారా ఉత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఉత్పత్తిలో భాగంగా గురువారం మిల్లులోని 7వ నెంబర్ పేపర్ మిషన్‌లో గురువారం సాయంత్రం మిల్లులో పూజలు నిర్వహించి ఉత్పత్తిని ప్రారంభించారు. పూజా కార్యక్రమాల్లో జెకె మిల్లుల డైరెక్టర్ సికె సూరి, వైస్ ప్రెసిడెంట్ మయాంక్ జిందాల్, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాగజ్‌నగర్ డి ఎస్పి సాంబయ్య, ప్లాంట్ హెడ్ పాండే, తహసిల్దార్ వనజా రెడ్డి, పట్టణ సి ఐ వెంకటేశ్వర్లుతో పాటు మిల్లు ఉద్యోగులు, వర్కర్లు పాల్గొన్నారు. వేద పండితులచే గణపతి హోమం, గణపతి పూజా, గౌరీ పూజ, నవగ్రహ పూజ, మహంకాళీ, మహా సరస్వతీ పూజా, నవగ్రహ స్థాపన, పూర్ణాహుతి, యంత్రయుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పేపర్ మిషన్‌ను మిల్లు డైరెక్టర్ సికె సూరితో కలసి ఎమ్మెల్యే కోనప్ప ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ సందర్బంగా మిల్లు జనరల్ మేనేజర్ (హెచ్ ఆర్) అలోక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ అర్దరాత్రి నుంచి పేపర్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని రోజుకు 90 టన్నుల చొప్పున యేడాదికి 27వేల టన్నుల ఉత్పత్తిని ఈ మిషన్ ద్వారా చేపడుతామని పేర్కొన్నారు. కాగా సిర్పూర్ పేపర్ మిల్లులో తిరిగి ఉత్పత్తి ప్రారంభం కావడంతో పట్టణ ప్రజలు, వ్యాపారస్తుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
చిత్రాలు.. పూజల్లో పాల్గొన్న మిల్లు యాజమన్య డైరెక్టర్, *పేపర్ మిషన్‌ను ప్రారంభిస్తున్న మిల్లు డైరెక్టర్ సూరి, ఎమ్మెల్యే కోనప్ప