బిజినెస్

భారీ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: అపరిష్కృతంగా సాగుతున్న చైనా-అమెరికా వాణిజ్య వైరుద్ధ్యాలతోబాటు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎదురైన వ్యతిరేక పరిస్థితులు శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీశాయి. ఆటో, లోహ స్టాక్ మార్కెట్లలో మదుపర్లు వాటాల విక్రయానికి పాల్పడంతో సెనె్సక్స్ 424 పాయింట్లు, నిఫ్టీ 125.80 పాయింట్ల వంతున నష్టపోయాయి. 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 1.15 శాతం నష్టాలతో 36,546.48 వద్ద, నిఫ్టీ 1.14 శాతం నష్టాలతో 10,943.60 వద్ద ముగిశాయి. లోహ, ఆటో రంగాల్లో అనూహ్యంగా మదుపర్లు వాటాల విక్రయాలకు దిగడంతో చివరి నిమిషాల్లో స్టాక్ మార్కెట్ల పతనం జరిగింది. ప్రధానంగా సెనె్సక్స్ ప్యాక్‌లో టాటామోటార్స్ సంస్థ అత్యధికంగా 17.93 శాతం నష్టాలను చవిచూసింది. గడచిన డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా త్రైమాసిక నష్టాలను రూ.26,960.8 కోట్లను చూపిన ఈ అతిపెద్ద మోటారు వాహనాల సంస్థ బ్రిటన్‌కు చెందిన ఆర్థిక నష్టాల్లో ఉన్న తన కంపెనీ శాఖ ‘జాగ్వర్ లాండ్ రోవర్’ వన్‌టైం అస్సెట్ ఇంపైర్‌మెంట్ నిర్వహించడం ద్వారా ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు తెలిసింది. ఇలావుండగా వేదాంత, టాటాస్టీల్, ఎన్‌పీటీసీ, ఓఎన్‌జీసీ, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, కోల్ ఇండియా, మారుతీ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ సైతం 5.75 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
స్వల్ప లాభాల్లో..
కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్ శుక్రవారం 0.95 శాతం స్వల్పలాభాలను సంతరించుకున్నాయి. బీఎస్‌ఈ లోహ సూచీలు 3.42 శాతం, ఆటో సూచీలు 3.37 శాతం వంతున నష్టపోయాయి. ఇక రంగాల వారీగా పరిశీలిస్తే ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, పార్మా సూచీలు సైతం నష్టాలతోనే ముగిశాయి. కాగా శుక్రవారం సైతం నిర్మాణ రంగం (రియాల్టీ) షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) 418.01 కోట్ల రూపాయల విలువైన వాటాలను గురువారం కొనుగోలు చేశారు. అలాగే దేశీయ ఇనె్వస్టర్లు సైతం రూ.294.11 కోట్ల విలువైన వాటాలను కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల కుదుపు
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో పరిష్కారం లభించే పరిస్థితులు లేవని ఇనె్వస్టర్లు నమ్మడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు మృగ్యమయ్యాయి. ‘డెడ్‌లైన్ తేదీ మార్చి1కంటే ముందు తాను చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్‌తో భేటీ అవుతానని అనుకోవడం లేద’ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం అంతర్జాతీయ మార్కెట్లలో కుదుపునకు దారితీసింది. ఈ రెండు అతిపెద్ద వాణిజ్య శక్తుల మధ్య సంప్రదింపులకు ఎప్పుడు తెరపడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని మార్కెట్ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఈక్రమంలో ఇనె్వస్టర్లలో అభద్రతా భావం నెలకొనడంతో పారిశ్రామిక సూచీ డౌజోన్స్ గురువారం 0.87 శాతం నష్టాలతో ముగిసింది. ఇలావుండగా ఆసియన్ మార్కెట్లలో జపాన్‌కు చెందిన నిక్కీ 2.19 శాతం నష్టపోగా, కొరియాకు చెందిన కోస్పి 1.20 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 0.16 శాతం వంతున నష్టాలను మూటగట్టుకున్నాయి. అలాగే యూరోజోన్‌లో ప్రాంక్‌ఫర్ట్‌కు చెందిన డీఏఎక్స్ 0.10 శాతం, ప్యారిస్‌కు చెందిన సీఏసీ-40 0.12 శాతం వంతున ఉదయపు డీల్స్‌లో స్వల్పంగా లాభపడ్డాయి. అలాగే లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ సైతం 0.19 శాతం లాభపడింది. ఇక అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ 32 పైసలు బలపడి 71.13 రూపాయలు పలికింది. ఇక ముడిచమురు ధరలు 0.28 శాతం పెరిగి బ్యారెల్ 61.80 డాలర్లు పలికింది.