బిజినెస్

పీఎస్‌యూలకు ప్రత్యేక రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా(యూపీ), ఫిబ్రవరి 10: సహజవాయుల ఉత్పత్తిలో చతికిలపడిన ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలు (పీఎస్‌యూ)లకు ప్రత్యేక రాయితీలను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తద్వారా ప్రభుత్వ నిర్వహణలోని ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఆయిల్)కు చెందిన డజను చమురు శుద్ధి కర్మాగారాల్లో సహజవాయు ఉత్పత్తికి సంబంధించిన ప్రతిబంధకాలను తొలగించి ఉత్పత్తిని పెంచాలన్నది ప్రభుత్వ యోచన. ప్రస్తుతం మనదేశంలో రోజుకు 90 మిలియన్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) సహజవాయు ఉత్పత్తి జరుగుతోంది. దీన్ని 2022 నాటికి ద్విగుణీకృతం చేయాలని, తద్వారా దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవాలని, అలాగే వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్న కొన్ని ద్రవ ఇంధనాల వినియోగానికి పుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆదివారం ఢిల్లీ పరిసరాల్లో జరిగిన పెట్రోటెక్ సదస్సులోప్రసంగిస్తూ అధికారులు తెలిపారు. ఓఎన్‌జీసీ, ఓఐఎల్ నేతృత్వంలోని సహజ వాయు ఉత్పత్తులు చేస్తున్న సుమారు డజను వరకు సంస్థలు ప్రభుత్వ నియంత్రిత ధరలకు ఉత్పత్తులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ సంస్థలకు కొంత ధరలు పెంచుకునేందుకు వెసులుబాటుతోబాటు కొన్ని రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనివల్ల ఆ సంస్థలు త్వరగా ఉత్పత్తి వైపు మళ్లేందుకు వీలవుతుందని చమురు మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ గత నెలలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం మంజూరు చేసిందని వీటిని ఓఎన్‌జీసీ, ఓఐఎల్‌కి చెందిన వివిధ అనుబంధ సంస్ధలకు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఐతే ఆ రాయితీలు ఎలా ఉంటాయో తమకు తెలియదని, అవి అధికంగానూ, నష్టాన్ని భర్తీ చేయగలిగేవిగానూ ఉండాలని తాము ప్రభుత్వం వత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ ధర మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్లు (ఎంఎంబీటీయూ)కు 3.36 డాలర్లు ఉత్పత్తి ఖర్చుకంటే తక్కువగా ఉన్నందువల్ల ఓఎన్‌జీసీ, ఓఐఎల్‌కు చెందిన సుమారు 12కు పైగా విభాగాలు ఉత్పత్తిని కొనసాగించడం క్లిష్టతరంగా మారిందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఓఎన్‌జీసీ ఆంధ్ర ప్రదేశ్‌లోని సముద్ర తీర ప్రాంతాలతోబాటు గుజరాత్, ముంబయి ప్రాంతాల్లో సుమారు 35 బిలియన్ క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి చేయగల నిల్వలున్నన్నట్టు పరిశోధనల్లో వెల్లడైందన్నారు, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్టా గోదావరి బేసిన్‌లోని మూడు బ్లాకుల్లో, పడమటి కోస్తాలోని కచ్, ముంబయి తీర ప్రాంతాల్లో 10 ఎంఎంఎస్‌సీఎండీ సహజవాయు ఉత్పత్తులు చేయవచ్చని, అలాగే తాజాగా కనుగొన్న బ్లాక్‌లు బంటుమిలీ, మండపేట, భువనగిరిల్లోనూ అదే స్ధాయిలో ఉత్పత్తులు చేయవచ్చని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. కాగా అరేబియా సముద్ర తీరంలోని ముంబయి హై సౌత్‌లోని నీలమ్ అండ్ బీ-127 క్లస్టర్‌లో మరికొన్ని పెట్టుబడుల ద్వారా మరో 5 ఎంఎంఎస్‌సీఎమ్‌డీ ఉత్పత్తులను పెంచవచ్చని పరిశోధనల్లో తేలిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాగోదావరి బేసిన్‌లో మూడు బిలియన్ క్యూబిక్ మీటర్ల ఉత్పత్తికి అనువైన నిల్వలున్నట్టు ఆయిల్ ఇండియా లిమిటెడ్ తేల్చిందన్నారు.
అయతే ఇక్కడ ఉత్పత్తిని చేపట్టాలంటే తొలుత అధిక ధరలను ప్రభుత్వం కేటాయించాల్సి ఉందన్నారు. అంతేగాక మార్కెటింగ్ స్వేచ్ఛను సైతం ప్రభుత్వం కల్పిస్తే ఈ ఫీల్డ్స్ ద్వారా సాహసోపేతమైన చర్యలతో అత్యధిక ఉత్పత్తిని చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ ఉత్పత్తి జరిగే సహజవాయువుకు ఎలాంటి నష్టాలూ లేకుండా ఎంఎంబీటీయూ 6 డాలర్ల వంతున ధర కల్పించాలని ఓఎన్‌జీసీ, ఓఐఎల్ కోరుతున్నాయన్నారు. అలాగాక 3 డాలర్లకే అయితే ఈ విభాగాలు నడవడం కష్టమన్నారు.