బిజినెస్

ఇక కంపెనీలకు విధిగా సెక్రటేరియల్ ఆడిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) సరికొత్త నిబంధనల మేరకు కార్పొరేట్ కంపెనీలు సంస్థాగత ఆడిట్ ద్వారా పాలనాపరమైన అంశాల్లో పారదర్శతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాక కంపెనీలకు చెందిన కార్యదర్శులు ఆ కంపెనీలకు చెందిన అన్ని అంశాలపై నివేదికలు సెబీకి సమర్పించేలా అధికారాలను ఇవ్వాల్సివుంటుంది. కంపెనీ సెక్రటరీల అత్యున్నత సంఘం ది ఇన్‌స్టిట్యూట్ ఇఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) అందించిన వివరాల మేరకు సెబీ జాబితాలో ఉన్న ప్రతి కంపెనీ, దానికి సంబంధించిన మెటీరియల్, సెబీ జాబితాలోలేని అనుబంధ కంపెనీలకు సంబంధించి విధిగా సెక్రటేరియల్ ఆడిను నిర్వహించాలి. 2019 మార్చి 31 నుంచి సమర్పించే వార్షిక నివేదికలతోబాటే ఇలా కొత్తగా నిర్ధేశించిన సెక్రటేరియల్ ఆడిట్ నివేదికలను సైతం సెబీకి సమర్పించాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీల పాలనా వ్యవహారాల్లో పారదర్శకత లోపిస్తోందన్న ఆరోపణల క్రమంలో సెబీ ఈతాజా నిబంధనలను తీసుకువచ్చిందని, కంపెనీలు తమ వాటాదార్లకు అన్ని విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఐసీఎస్‌ఐ అధ్యక్షడు రంజీత్ పాండే పీటీఐకి చెప్పారు. అన్ని పనులూ బాధ్యతాయుతంగా ఉండాలన్నదే సెబీ లక్ష్యమని ఆయన అన్నారు. ఐతే కార్యదర్శులు సైతం నివేదికలు పరిపూర్ణంగా వాస్తవంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీ చట్టాలు, సెబీ నియంత్రణలు, పారిశ్రామిక, కార్మిక చట్టాలతోబాటు కంపెనీల నిర్వహణ విధానాలను సైతం ఈ విషయంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెబీ కొత్త నిబంధనలతో కార్యదర్శుల విధినిర్వహణ మరింత నాణ్యతాయుతంగా, లోతుగా జరిగేందుకు అవకాశం కల్పించిందని పాండే చెప్పారు. ప్రస్తుతం కంపెనీల్లో కార్యదర్శులు సంబంధిత బోర్డులకు అందజేస్తున్న నివేదికలు బయటి ప్రపంచానికి తెలిసేవికాదు. ఐతే సెబీ కొత్త నిబంధనలతో అవి ప్రజలందరికీ తెలిసేలా పారదర్శకతను కలిగివుంటాయని తెలిపారు.
ఇప్పటి వరకు కంపెనీ కార్యదర్శులు ఇచ్చే ఆడిట్ నివేదికల్లో మేనేజ్‌మెంట్ జోక్యం నివేదికలోని అంశాల్లో మార్పులు చోటుచేసుకునేవి. ఇకపై అలాంటివి జరిగే వీలులేదు. తుది నివేదికపై కార్యదర్శులకే పూర్తి అధికారాలు ఉంటాయి.