బిజినెస్

అంతర్జాతీయ సూచీలే కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 10: భారత స్టాక్ మార్కెట్ వచ్చే వారం ఏ విధంగా ఉంటుందనేది ఎవరి అంచనాకూ అందడం లేదు. స్థానిక మార్కెట్ దిశ ఎటో అర్థం కాకపోవడంతో, అంతర్జాతీయ సూచీలే రాబోయే వారంలో కీలకంగా మారుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈక్విటీ మార్కెట్‌లో సెంటిమెంట్లు బలంగా పని చేస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం, ద్రవ్యోల్బణం అధికావడం వంటి అంశాలు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ట్రేడింగ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈవారం కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది. కాగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తునే ఉంది. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడలేదు. మార్చి ఒకటో తేదీలోగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చర్చలు జరపాలని చైనా డిమాండ్ చేస్తున్నది. అయితే, ఈ డెడ్‌లైన్‌ను ట్రంప్ పట్టించుకోవడం లేదు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలుసుకోవడానికి ట్రంప్ ససేమిరా అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అగ్ర రాజ్యం ఒకవైపు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థితికి చేరిన చైనా మరోవైపు కత్తులు దూస్తుండడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా భారీగా పన్నులు విధిస్తే, అమెరికా వస్తువుల విషయంలో చైనా కూడా అదే తరహాలో స్పందించింది. దీనితో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. ఎవరూ వెనుకడుగు వేయకపోవడంతో తీవ్ర స్థాయికి చేరింది. ఇరు దేశాల ప్రతినిధుల బృందాల మధ్య చర్చలు జరిగినా ఫలితం ఉండదని ఇప్పటికే స్పష్టమైంది. ట్రంప్, జిన్‌పింగ్ స్వయంగా పూనుకుంటేగానీ సమస్యకు తెరపడదు. కానీ, ఇద్దరూ కలిసే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదన్న వాదన వినిపిస్తున్నది. ఈ కారణంగానే ప్రపంచ మార్కెట్ వేగాన్ని కోల్పోయింది. మరికొంత కాలం, కనీసం వారం పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. కాబట్టి, దేశీయ మదుపరులు క్రియాశీలకంగా వ్యవహరిస్తే తప్ప భారత స్టాక్ మార్కెట్ కోలుకోదన్నది వాస్తవం. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి తప్పకపోవచ్చు.