బిజినెస్

పాకిస్తాన్‌కు సౌదీ చేయూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, ఫిబ్రవరి 11: తీవ్రమయిన నగదు కొరతను ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ను ఆదుకోవడానికి ఒక రికార్డు పెట్టుబడి ప్యాకేజీని సౌదీ అరేబియా సిద్ధం చేసింది. ఈ ఇనె్వస్ట్‌మెంట్ ప్యాకేజీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న ముస్లిం మిత్ర దేశమయిన పాకిస్తాన్‌కు ఉపశమనాన్ని కలిగించడంతో పాటు ప్రాంతీయ భౌగోళిక రాజకీయ సవాళ్లను పరిష్కరించడానికి తోడ్పడుతుందని విశే్లషకులు పేర్కొంటున్నారు.
ఈ ఇనె్వస్ట్‌మెంట్ ప్యాకేజీలో భాగంగా అరేబియా సముద్రంలోని వ్యూహాత్మకమయిన గ్వాడర్ ఓడరేవులో పది బిలియన్ డాలర్ల రిఫైనరీ, చమురు కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. అనేక బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌కు అంతిమ గమ్యంగా ఇది ఉంటుంది. చబహర్‌లో గల ఇండో-అమెరికన్ పోర్ట్‌కు ఇది ఎంతో దూరంలో లేదు. సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ త్వరలోనే పాకిస్తాన్‌ను సందర్శిస్తారని సౌదీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఒక వార్తాసంస్థకు తెలిపాయి. అయితే, ఆయన పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన ఖచ్చితమయిన తేదీలను వెల్లడించలేదు. ఈ పర్యటన సందర్భంగా సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య పెద్ద మొత్తంలో పెట్టుబడులకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ఇరు దేశాలకు చెందిన అధికార వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు దశాబ్దాల తరబడి మిత్ర దేశాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. సౌదీకి చెందిన ఉన్నత స్థాయి నేత పాకిస్తాన్ సందర్శన సందర్భంగా కుదుర్చుకోవలసిన ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య కొన్ని నెలల తరబడి చర్చలు జరిగాయి.