బిజినెస్

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ)ల రెండు భారీ విలీనాల తర్వాత, కొంతకాలం విరామం ఇవ్వాలని కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విలీనానికి గత నెల కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనితో దేశంలో మూడో అతి పెద్ద బ్యాంక్‌గా బీఓబీ అవతరించింది. అయితే, సమ్మేళన ప్రక్రియ పూర్తికావడంతోపాటు, లావాదేవలు ఒక గాడిలో పడే వరకూ మరో విలీనానికి ప్రయత్నించ కూడదని కేంద్రం అనుకుంటున్నదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్రివిధ విలీననాల ప్రక్రియ సంపూర్ణమై, పరిస్థితులను చక్కదిద్దుకునే వరకూ మరో ప్రయోగానికి వెళ్లరాదన్నది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయంగా తెలుస్తోంది. భారీ విలీనాల తర్వాత, పరిస్థితులన్నీ ఒక కొలిక్కి వచ్చి, పాలనా వ్యవహారాలన్నీ గాడిలో పడిన తర్వాతే ఇతరత్రా ప్రతిపాదనలపై దృష్టి సారించివచ్చని అనుకుంటున్నట్టు సమాచారం.