బిజినెస్

కళతప్పిన పసిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణులను ప్రదర్శించడంతో, ఈవారం బులియన్ మార్కెట్‌లో లావాదేవీలకు మొదటి రోజైన సోమవారం బంగారం కళతప్పింది. పది గ్రాముల బంగారం ధర 55 రూపాయలు తగ్గడంతో, 34,255 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ సూచీలతోపాటు, దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా బంగారం ధర తగ్గుదలకు కారణమైంది. వెండి లావాదేవీలు కూడా అదే దారిలో నడిచాయి. కిలో వెండి ధర 150 రూపాయలు తగ్గడంతో 41,100 రూపాయలకు చేరింది. పారిశ్రామిక రంగం నుంచి వెండికి డిమాండ్ తగ్గింది. ఫలితంగా ధర పతనమైంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి కొనుగోళ్లు తగ్గడంతో, ఆ ప్రభావం భారత బులియన్ మార్కెట్‌పైన కూడా పడింది. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.24 శాతం తగ్గి, 1,312 అమెరికా డాలర్లకు చేరింది. అదే విధంగా వెండి 0.51 శా తం తగ్గడంతో 15.82 డాలర్ల వద్ద ముగిసింది. మొత్తం మీ ద అంతర్జాతీయ సూచీల తగ్గుదల భారత బులియన్ మా ర్కెట్‌ను దెబ్బతీసింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం తప్పదన్న అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.