బిజినెస్

ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతి హబ్‌గా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశీయంగా ఎలక్ట్రానిక్ వస్తూత్పత్తిలోనే కాకుండా ఎగుమతుల హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దాలన్న ప్రధానోద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఎంఏఐటీ నేతృత్వంలో సోమవారం నాడిక్కడ ఏర్పాటైన ‘ఎలక్ట్రానిక్స్ మానిఫాక్చరింగ్ సమ్మిట్-2019’ లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సౌహ్నే పాల్గొని ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ ఎకో సిస్టం ను మరింతగా విస్తరించడం, లోతైన అధ్యయనం చేయడంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి కేంద్రీకరించిందని ఆయన పేర్కొన్నారు. దేశానికి దిగుమతి అవుతున్న అనేక బ్రాండ్లతో కూడిన ఎలక్ట్రానిక్ వస్తువులు మనకు సైతం తయారీలో వినూత్న దృక్ఫథాన్ని కల్పిస్తున్నాయని, స్థానికంగా వస్తూత్పత్తిలో విదేశీ సరఫరాదార్లు కూడా చైన్ పార్ట్‌నర్లుగా మారుతున్నారన్నారు. ఈక్రమంలో మనం కేవలం స్థానిక వస్తూత్పత్తిపైనే కాకుండా ఎగుమతులపై కూడా ప్రధాన దృష్టి నిలపాల్సివుందన్నారు. ప్రభుత్వ సరికొత్త విధానాలు కొన్ని ఇందుకు దోహదం చేస్తాయని అజయ్ ప్రకాష్ చెప్పారు. విదేశాలు కేవలం ఎగుమతులపై దృష్టి పెడితే మనం సప్లై చైన్ పార్ట్‌నర్లను తీసుకువచ్చే విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బహళ జాతి సంస్థలు ఇప్పటికే భారతీయ డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ)ని నూతన వస్తూత్పత్తికి, సేవలకు వినియోగించుకుంటున్నాయన్నారు. ఈక్రమంలో మన దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ ఎకోసిస్టం అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని, అంతర్జాతీయ ఎకోసిస్టంలో భాగస్వామ్యం కావడానికి సువర్ణావకాశంగా ఆయన అభివర్ణించారు. సిస్కోకు చెందిన సప్లై చైన్ ఆపరేషన్స్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ కెర్న్ మాట్లాడుతూ ఎగుమతుల రంగంలో భారత్ భవిష్యత్తులో అన్ని దేశాలకూ ఆదర్శంగా నిలిచే అవకాశాలున్నాయన్నారు. 18 నెలల క్రితం సిస్కో భారత్‌లో ఎలక్ట్రానిక్ వస్తూత్పత్తిని ప్రారంభించిందని, అనేక రకాల స్విచ్చింగ్, వైర్‌లెస్ ఉత్పత్తులను ఎగుమతులు చేయడం జరుగుతోందని, ఈ క్రమంలో స్థానికంగా ఉద్యోగావకాశాలను కల్పించడంతోబాటు, సరఫరా దార్లను ఏర్పాటు చేశామని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణను ఇస్తున్నామని కెర్న్ వివరించారు.