బిజినెస్

15 నెలల గరిష్ఠానికి నిఫ్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 8: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 15 నెలలకుపైగా గరిష్ఠ స్థాయిని అందుకుంది. 28.20 పాయింట్లు పెరిగి 8,700 స్థాయికి ఎగువన 8,711.35 వద్ద నిలిచింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ కూడా 104.22 పాయింట్లు పుంజుకుని 28,182.57 వద్ద స్థిరపడింది. గత వారం చివరి రెండు రోజులు కూడా సూచీలు లాభాలను అందుకున్నది తెలిసిందే. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష ఉండటం, విదేశీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, విదేశీ మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచడం వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. దీంతో చమురు, గ్యాస్, పవర్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఐటి, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, చైనా సూచీలు లాభపడగా, ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు పుంజుకున్నాయి.