బిజినెస్

పనులు ప్రారంభానికి సిద్ధమైన ఐదు గనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశ వ్యాప్తంగా గత మూడేళ్లలో వేలం వేసిన 55 గనులకు చెందిన ఐదు ఖనిజ బ్లాకులు పనులు ఆరంభించేందుకు సిద్ధమయ్యాయి. మరో రెండు లేదా మూడు గనులు సైతం వచ్చే నెలాఖరుకల్లా పనులు ప్రారంభిస్తాయని కేంద్ర గనుల శాఖ శుక్రవారం తెలియజేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 గనుల్లో పనులు ప్రారంభమవుతాయని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి అనిల్ గోపీ శంకర్ ముకిమ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో రెండు నుంచి మూడు గనుల్లో పనులు ఆరంభమవుతాయన్నారు. కాగా ఈ గనులకు సంబంధించిన పర్యావరణ క్లియరెన్స్ వంటి అనుమతులు కూడా త్వరగా మంజూరు చేస్తామని గతంలో వీటిని అమ్మకాలకు పెట్టేముందే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే రాబోయే రెండేళ్లలో గనుల లీజు వ్యవధి ముగిసిపోబోతున్న 288 గనుల లీజుదారుల స్థానంలో ఎంపికయ్యే కొత్త వారికి ఏకకాలంలో పర్యావరణ, అటవీ శాఖల క్లియరెన్స్‌లు మంజూరు చేసేలా గనుల శాఖ పాలనాపరమైన ఆదేశాలను ఇప్పటికే విడుదల చేసింది. ప్రధానంగా 2018 జాతీయ ఖనిజ విధానాన్ని కేంద్రం రూపొందించింది. కొత్త ఖనిజ నిక్షేపాల కోసం అనే్వషణను విస్తృతం చేయడంతోబాటు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పించడానికి కొత్త విధానంలో ప్రాధాన్యత నివ్వడం జరిగింది. ఈ క్రమంలో కొత్త విధానానికి సంబంధించి అనుమతుల మంజూరు, డ్రాఫ్ట్‌ల రూపకల్పన చివరి దశల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మూడేళ్లలో వేలం వేసిన 53 గనుల ద్వారా లీజు కాలంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు 1.83 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని గత నెలలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.