బిజినెస్

స్టాక్ మార్కెట్‌కు తప్పని నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: స్టాక్ మార్కెట్ లావాదేవీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. మొత్తం మీద వరుసగా ఏడో సెషన్‌లోనూ సెనె్సక్స్ పతనం కావడం మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషె మహమ్మద్ పుల్వామాలో జరిపిన మారణకాండ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఇరు దేశాల మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారడం ఇనె్వస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యాలెర్ ముడి చమురు ధర 65 డాలర్లు పెరగడం, రూపాయి మారకపు విలువ బలపడక పోవడం, చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం వంటి అంశాలు మధ్య ప్రతికూల ధోరణులతో కొనసాగిన సెనె్సక్స్ ఒకానొక సమయంలో 365 పాయింట్లు నష్టపోయింది. చివరిలో దేశీయ, సంస్థాగత మదుపరులు షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపడంతో పరిస్థితి చాలా వరకూ మెరుగుపడింది. అయితే, నష్టం మాత్రం తప్పలేదు. 67.27 పాయింట్లు పతనమైన సెనె్సక్స్ 35,510.97 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 21.65 పాయింట్లు (0.20 శాతం) నష్టపోయి 10,724.40 పాయింట్లకు పడిపోయింది. సన్ ఫార్మా, టాటా స్టీల్, వేదాంత, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎప్‌సీ, మారుతి తదితర కంపెనీలు సగటున 3.94 శాతం నష్టాన్ని మూటగట్టుకున్నాయి. అయితే, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, కోల్ ఇండియా వంటి కంపెనీల స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ కంపెనీల వాటాల ధర సగటున 4.13 శాతం పెరిగింది. ఆసియా స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లపై అమెరికా రీటైల్ మార్కెట్ పతనం ప్రభావాన్ని చూపింది. 2009 తర్వాత మొదటిసారి అమెరికా రీటైల్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూడడం గమనార్హం. ఈ పరిణామం సహజంగానే అమెరికా ఆర్థిక పరిస్థితిపై అనుమానాలకు తావిస్తున్నది. ప్రపంచ స్టాక్ మార్కెట్లతోపాటు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)పైన కూడా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపింది. మొత్తం మీద శుక్రవారం నాటి లావాదేవీల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు 250.23 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మారు. దేశీయ సంస్థాగత మదుపరులు 1,225.24 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. స్థూలంగా చూస్తే, ఈవారం మొత్తం నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ కొనసాగింది. గత కొంత కాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి ఇంకెంత కాలం ఉంటుందనే ప్రశ్న ఇనె్వస్టర్లను, స్టాక్ బ్రోకర్లను ఆందోళనకు గురి చేస్తున్నది.