బిజినెస్

టెక్ మహీంద్ర బై బ్యాక్ సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రఖ్యాత ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర తన షేర్లను తిరిగి కొనడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈనెల 21న జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనుంది. షేర్స్ బై బ్యాక్ అంశం బోర్డు పరిశీలనలో ఉందని టెక్ మహీంద్ర శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, వివరాలను మాత్రం వెల్లడించలేదు. పూర్తిగా చెల్లించబడిన షేర్లను తిరిగి కొనాలన్న ఆలోచన ఉందని, తుది నిర్ణయం బోర్డుదేనని తెలిపింది. ఈమేరకు బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఫైలింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసిం ది. దేశంలోని చాలా వరకు ఐటీ కంపెనీలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. దీనితో నిధులు పుష్కలంగా అందుబాటులో ఉంటున్నాయి. ఇది వరకే ఇన్ఫోసిస్ రెండో విడత షేర్ల బై బ్యాక్‌ను ప్రారంభించగా, త్వరలోనే టెక్ మహీంద్ర కూడా అదే దారిని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.