బిజినెస్

ఆదాయంపై జాక్వర్ గ్రూప్ భారీ అంచనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 16: శానిటరీ వేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న జాక్వర్ గ్రూప్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపై భారీ అంచనాలతో ఉంది. సుమారు 3,900 కోట్ల రూపాయల మేర ఆదాయంపై కనే్నసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో జాక్వర్ కంపెనీ తన అంచనాలపై ప్రకటన చేయడం గమనార్హం. 2022 నాటికి బిలియన్ డాలర్ల ఆదాయ మైలురాయిని చేరడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు జాక్వర్ గ్రూప్ పేర్కొంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నోవర్ 3,123 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిఖ సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామని శనివారం ఇక్కడ జరిగిన ఒక షో రూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జాక్వర్ గ్రూప్ ప్రమోటర్ రాజేష్ మెహ్రా ధీమా వ్యక్తం చేశారు. ఆదాయం పెరిగితే, నికర లాభం కూడా పెరుగుతుందని వ్యాఖ్యానించారు. చెన్నైలోనూ తమ కంపెనీకి గొప్ప మార్కెట్ ఉందని, ఇది నిజంగా ఆనందాన్నిచ్చే అంశమని పేర్కొన్నారు. జాక్వర్ గ్రూప్ శానిటరీ వేర్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లో మార్కెట్ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరింతగా బలపడి, మరో మూడేళ్ల కాలంలో బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమిస్తామన్న నమ్మకం తనకు ఉందన్నారు.
ఎస్‌పీఆర్ గ్రూప్‌తో ఎంఓయూ
ఎస్‌పీఆర్ గ్రూప్‌తో జాక్వర్ గ్రూప్ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పేరు పొందిన ఎస్‌పీఆర్ సంస్థతో కలిసి చెన్నైలో మార్కెట్‌ను విస్తరించడానికి జాక్వర్ గ్రూప్ వ్యూహ రచన చేస్తున్నది. శానిటరీ వేర్‌కూ, భవన నిర్మాణం పరస్పర ఆధారిత రంగాలు కావడంతో ఈ రెండు సంస్థల ఒప్పందం మార్కెట్ అవకాశాలను మెరుగుపరచనుంది.