బిజినెస్

ప్రతికూల ధోరణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఈవారం మొత్తం మీద భారత స్టాక్ మార్కెట్‌లో ప్రతికూల ధోరణులు కొనసాగాయి. ఫలితంగా నష్టాలు కొనసాగాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈవారం ట్రేడింగ్ మొదటి నుంచి చివరి వరకూ నష్టాల్లోనే కొనసాగింది. బీఎస్‌ఈలో సెనె్సక్స్, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ పతనం స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చితి, ప్రతికూల సెంటిమెంట్లకు అద్దం పడుతున్నది. స్థూలంగా చూస్తే ఈవారం సెనెక్స్ 737.53 పాయింట్లు, నిఫ్టీ 219.20 పాయింట్లు నష్టపోయాయి. గత వారం చివరిలో నష్టాలను ఎదుర్కొన్న సెనె్సక్స్ ఈవారంలోనూ కోలుకోలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరుగుదలకు, అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడకపోవడం తోడైంది. అంతేగాక, అమెరికా రీటైల్ మార్కెట్ సుమారుగా గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని రీతిలో దారుణంగా నష్టపోయింది. ఇది కూడా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసింది. రూపాయి మారకపు విలువ బలపడకపోవడం స్టాక్ మార్కెట్ నష్టాలకు మరో కారణమైంది. అన్ని అంశాలూ ముప్పేట దాడి చేయడంతో, ఈవారంలో స్టాక్ మార్కెట్ కోలుకోలేకపోయింది. విదేశీ ఇనె్వస్టర్లు స్టాక్స్ అమ్మకాలకు ప్రాధాన్యమిచ్చిన కారణంగా మార్కెట్ తీవ్రమైన ఒత్తిడికి గురైంది. అమ్మకాలు పెరగడంతో, వివిధ కంపెనీల వాటాల ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే, దేశీయ సంస్థాగత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. వీరు ఆదుకోవడంతో పరిస్థితి కొంతలో కొంత మెరుగైంది. లేకపోతే, సెనె్సక్స్, నిఫ్టీ పాయింట్ల పతనం వేలల్లో ఉండేది. వారం మొత్తంలో ట్రేడింగ్ అయిన షేర్లు 16,44,35,450కాగా, టర్నోవర్ 36,258.48 కోట్ల రూపాయలు. ట్రేడింగ్ తక్కువ స్థాయిలో ఉండడం స్టాక్ మార్కెట్‌కు కొత్తకాదు. అయితే, వరుసగా ఏడు సెషన్లు నష్టాల్లో కొనసాగడం మాత్రం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. భవిష్యత్తులో మార్కెట్ గమనం ఏ దిశగా ఉంటుంది? ఏఏ కంపెనీల షేర్లు లాభదాయకం? ఏ కంపెనీల షేర్లకు ప్రస్తుతం దూరంగా ఉంటూ, పరిశీలించాలి? అనే ప్రశ్నలు అటు ఇనె్వస్టర్లను, ఇటు స్టాక్ బ్రోకర్లను వేధిస్తున్నాయి. గత కొంతకాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడకపోగా, కొత్త సమస్యలు పుట్టుకురావడం భారత స్టాక్ మార్కెట్‌ను గందరగోళంలోకి నెడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంత బడ్జెట్ ప్రభావం మార్కెట్‌పై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపలేదనే చెప్పాలి. లేకపోతే, ఈవారం మార్కెట్ సానుకూల పరిస్థితుల్లో ముగిసేది. కానీ, అందుకు భిన్నంగా నష్టాల్లోనే కొనసాగింది. భవిష్యత్తుపై అనుమానాలను రేకెత్తిస్తున్నది. గత ఏడాది కాలంలో ఎన్నడూ స్టాక్ మార్కెట్ పతనం వరుసగా ఏడు రోజులు కొనసాగలేదు. ఒకటిరెండు రోజులు పతనమైతే, ఆతర్వాత మళ్లీ పుంజుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వరుస పతనం స్టాక్ మార్కెట్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఈ వారం బీఎస్‌ఈలో లావాదేవీలను గమనిస్తే, స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి కొనసాగడం స్పష్టంగా కనిపిస్తుంది. మార్కెట్‌లో అనిశ్చితి సహజంగానే ఇనె్వస్టర్లను ఆందోళనకు గురి చేసింది. దీనికితోడు ప్రతికూల ధోరణులు అంతర్జాతీయ మార్కెట్‌ను శాసించడం కూడా వాటాల అమ్మకాలు పెరిగేందుకు ఒక కారణమైంది. పీడ కలలాంటి ఈవారం మార్కెట్ మిగిల్చిన చేదు అనుభవాల నుంచి తేరుకొని, వచ్చేవారం ట్రేడింగ్‌కు మదుపరులు, స్టాక్ బ్రోకర్లు సంసిద్ధం కావాలి.