బిజినెస్

స్టాక్ మార్కెట్ గట్టెక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 17: స్టాక్ మార్కెట్ నష్టాల ఊబి నుంచి గట్టెక్కుతుందా?. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో గత వారం మొత్తం పతనమవుతూ వచ్చిన సెనె్సక్స్ సోమవారం నుంచి మొదలయ్యే కొత్త వారంలోనైనా కోలుకుంటుందా? ప్రపంచ మార్కెట్ పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్‌ను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయి? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను అరుణ్ జైట్లీ తిరిగి స్వీకరించిన నేపథ్యంలో మార్కెట్ కుదుటపడుతుందా? స్టాక్ మార్కెట్‌తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్నలివి. గత వారం వరుస నష్టాలు స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. బుల్ రన్‌కు బ్రేక్ పడగా, బీఎస్‌ఈలో బేర్ అరుపులే హోరెత్తాయి. 36,546.48 పాయింట్లతో సోమవారం ఉదయం ప్రారంభమైన సెనె్సక్స్ నష్టాల్లో కొనసాగి, 36,395.03 పాయింట్ల వద్ద ముగిసింది. ఆతర్వాత కూడా పతనం కొనసాగింది. మంగళ, బుధ, గురువారాల్లో వరుసగా 36,153.62 పాయింట్లు, 36,034.11 పాయింట్లు, 32,370.04 పాయింట్లు చొప్పున నమోదైంది. గత వారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం కూడా పతనం తప్పలేదు. అనిశ్చితి మధ్య ఊగిసలాడి చివరికి 35,808.95 పాయింట్ల వద్ద తెరపడింది. అంతకు ముందు వారం చివరిలో మొదలైన సెనె్సక్స్ పతనం వరుసగా ఏడు రోజుల్లో ఎన్నడూ కోలుకోలేదు. ప్రతి సెషన్‌లోనూ పతనం నమోదవుతునే వచ్చింది. ఈ పరిస్థితుల్లో, వచ్చే వారం సాటక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ స్పష్టంగా కనిపిస్తున్నది.
అమెరికా, చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఇరు దేశాల ఉన్నతాధికారులు ఒకసారి సమావేశమైనప్పటికీ, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోయారు. చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌తో ముఖాముఖి చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖంగా లేరు. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య వాణిజయ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది శేష ప్రశ్నగానే మిగిలిపోతున్నది. మరోవైపు, అమెరికా రీటైల్ మార్కెట్ గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని రీతిలో పతనమైంది. అక్కడి ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇదొక ఉదాహరణ మాత్రమే. అమెరికా పరిస్థితులు యావత్ ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. గత వారం భారత స్టాక్ మార్కెట్ పతనానికి ఇదొక కారణం. మరోవైపు, అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 65 డాలర్లు చొప్పున పెరిగింది. రూపాయి మారకం విలువ గత వారం పతనం కాకపోయినప్పటికీ, బలంగా స్థిరపడలేదు. బీఎస్‌ఈ నష్టాలకు ఈ అంశాలు కూడా కారణమవుతున్నాయి. వచ్చే వారం ముడి చమురు ధర పెరగకుండా అదుపులోనే ఉంటుంటా? రూపాయి మారకం విలువ బలపడుతుందా? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఏ దిశగా వెళుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన నేపథ్యంలో, ఆయన స్థానంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు పలు అంశాలను మధ్యంతర బడ్జెట్‌లో చేర్చిందనేది వాస్తవం. కాగా, స్వదేశం చేరుకున్న జైట్లీ శుక్రవారం తిరిగి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించారు. ఈ పరిణామంతో, ఇంత కాలం ఉన్న అనిశ్చితికి తెరపడుతుందని, ఆర్థిక పరిస్థితి ఇక కుదుట పడుతుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతుంది. భారత స్టాక్ మార్కెట్ వచ్చే వారం నష్టాల ఊబి నుంచి కోలుకొని, మళ్లీ గాడిలో పడుతుందనే ఆశతో ఇనె్వస్టర్లు, స్టాక్ బ్రోకర్లు లావాదేవీలకు సిద్ధమవుతున్నారు. వారి అంచనాలు ఏ ఎంత వరకూ ఫలిస్తాయో? స్టాక్ మార్కెట్ ఎంత వరకూ కోలుకుంటుందో? చూడాలి.
ఇలావుంటే, విదేశీ మారకం నిల్వల పతనం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నది. గత వారం నిల్వలు 211.9 కోట్ల డాలర్లు మేరకు తగ్గడంతో, 39,812.20 కోట్ల డాలర్లకు చేరింది. అంతకు ముందు వారం 206.3 కోట్ల డాలర్లు పెరిగిన నిల్వలు 40,024 కోట్ల డాలర్లకు ఎగబాకింది. కానీ, గత వారం మళ్లీ నిల్వలు తగ్గడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.