బిజినెస్

రిలయన్స్ గ్రూప్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ తన రుణదాతలతో షేర్ల అమ్మకాలపై ఒక ఒప్పందానికి వచ్చింది. ప్రస్తుతానికి రుణాలపై వడ్డీతోపాటు అసలులో కొంత భాగాన్ని నిర్ణీత తేదీల్లో చెల్లించాలని, ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ షేర్ల అమ్మకాల ఒప్పందాన్ని నిలిపివేయాలని సుమారు 90 శాతం రుణదాతలతో అవగాహనకు వచ్చినట్టు రిలియన్స్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం రుణదాతలు షేర్ల కేటాయింపు కోసం సెప్టెంబర్ వరకూ వేచి చూడక తప్పదు. కాగా, రిలయన్స్ పవర్‌లో సంస్థాగత పెట్టుబడిదారులకు 30 శాతం వాటాలను కేటాయించే విషయంపై ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంకర్లను నియమించినట్టు రిలయన్స్ గ్రూప్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ బ్యాంకర్లు త్వరలోనే విధివిధానాలను ఖరారు చేయనున్నట్టు తెలిపింది. రిలయన్స్ గ్రూప్ రుణదాతల జాబితాలో టెంపుల్టన్ ఎంఎఫ్, డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రామెరికా ఎంఎఫ్, ఇండియా బుల్స్ ఎంఎఫ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ తదితర సంస్థలు ఉన్నాయి. రుణదాతలకు షేర్ల కేటాయింపు అంశంపై రిలయన్స్ గ్రూప్ ప్రతినిధులను పీటీఐ సంప్రదించగా, సెప్టెంబర్ వరకూ ఈ ప్రతిపాదనను నిలిపివేయానికి అత్యధిక శాతం రుణదాతలు అంగీకరించారని తెలిపారు. తొంభై శాతాని కంటే ఎక్కువ మంది సంఘీభావం తెలిపినట్టు చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకూ షేర్ల కోసం డిమాండ్ చేయడంగానీ, ప్రమోటర్ల షేర్లను అమ్మడానికిగానీ రుణదాతలకు అవకాశం ఉండదు.

చిత్రం.. రిలయన్స్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ