బిజినెస్

రండి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోఫియా (బల్గేరియా): అభివృద్ధిలో దూసుకుపోతూ, అవకాశాల ధామంగా ఉన్న భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నట్టు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం బల్గేరియాకు వచ్చిన ఆమె అక్కడ నివసిస్తున్న భారతీయులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ భారత్, బల్గేరియా దేశాల మధ్య ఎన్నో శతాబ్దాలుగా ద్వైపాక్షిక బంధం కొనసాగుతోందని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇరుదేశాల ప్రజలు ఎంతో స్నేహం, సామరస్యంతో కలిసిమెలసి ఉంటున్నారని ఆమె ప్రశంసించారు. ప్రజాస్వామ్యం, బహుమతాలు, బహుజాతులు, బహుళ వాదం, సహనం, ఓర్పు, సామాజిక సామరస్యం వంటి లక్షణాలు ఇరుదేశాల్లోనూ మనకు కన్పిస్తాయని అన్నారు. బల్గేరియాను భారత్ ఎప్పుడూ నిజమైన మిత్రదేశంగా భావిస్తుందని ఆమె అన్నారు. రాబోయే సంవత్సరాలలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారంతో మరింత అభివృద్ధిని సాధిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. భారత్ దేశ అభివృద్ధిలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల పాత్ర ఎంతో ఉందని, అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న మనదేశ వృద్ధిలో వారు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నామన్నారు. పెట్టుబడులు, వాణిజ్యానికి భారత్‌లో పుష్కలమైన అవకాశాలున్నాయని అన్నారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమానికి దేశం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, భారత్‌తో నిత్యం సంబంధాలు నెరపడానికి తాము అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. దీని నిమిత్తం సీసీఐ పథకాన్ని మరింత సరళతరం చేశామని, న్యూఢిల్లీలో ప్రవాస భారతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆమె గుర్తు చేశారు. భారతీయ మహిళలను వివాహం చేసుకుని, వారికి అన్యాయం చేసే వారి ఆటలు కట్టించడానికి తాము ఇటీవల రాజ్యసభలో ఎన్‌ఆర్‌ఐ మేరేజ్ బిల్లును ప్రవేశపెట్టినట్టు మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. అంతకుందు ఆమె సౌత్‌పార్కులోని మహాత్ముని విగ్రహం వద్ద పూలతో నివాళి అర్పించారు.