బిజినెస్

భారత్‌లో బిగో పెట్టుబడులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: భారత దేశంలో భారీగా పెట్టుబడులకు సింగపూర్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న బిగో టెక్నాలజీ సన్నాహాలు చేస్తున్నది. యాండ్రాయిడ్ అభివృద్ధితోపాటు, పలు రకాలపై యాప్స్‌ను డెవలప్ చేయడంలో పేరు పొందిన బిగో వచ్చే మూడేళ్ల కాలంలో సుమారు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు రంగం సిద్ధం చేసింది. త్వరలోనే భారత్‌లో ఒక ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభిస్తామని, వెయ్యి మందికి పైగా ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌తోపాటు అమెరికా, మధ్యతూర్పు-ఉత్తర ఆఫ్రికా (ఎంఈఎన్‌ఏ), ఐరోపా ప్రాంతాల్లోనూ ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు బిగో కంపెనీ చీఫ్ టెక్నాలజీ అధికారి జాసన్ హూ తన ప్రకటనలో వివరించారు. ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్లకు రెండో అతిపెద్ద మార్కెట్ ఉన్న భారత్‌లో తమ కంపెనీకి ఆదరణ బాగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జనాభాలో యువత ఎక్కువగా ఉన్నందున, మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో మార్కెట్ విస్తారమని పేర్కొన్నారు.