బిజినెస్

శాఖలను తగ్గించే ప్రతిపాదన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 18: దేశంలో తమ శాఖల సంఖ్యను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది. వివిధ రంగాలకు రుణాలను అందించే దేశీయ బ్యాంక్‌ల్లో అతి పెద్దదైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా కొన్ని ఇతర బ్యాంక్‌ల మాదిగానే శాఖలను తగ్గిస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే, ఇందులో ఏమాత్రం నిజం లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్య పురి స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులోనూ అలాంటి ప్రతిపాదన వస్తుందని అనుకోవడం లేదన్నారు. చాలా బ్యాంక్‌లు ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ, ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. నిజానికి ఖాతాదారులు బ్యాంక్‌లకు వెళ్లకుండా నే, అన్ని రకాల సేవలను పొందే అవకావా లు విస్తృతమయ్యాయి. ఈ కారణంగానే వివిధ బ్యాంక్‌లు సేవలను పెంచుతూ, శాఖలను తగ్గిస్తున్నాయి. అతిపెద్ద బ్యాంక్‌ల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ ఇదే దారిని అనుసరిస్తుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ, అవి ఏమాత్రం నిజం కావని ఆదిత్య పురి తేల్చిచెప్పారు. శాఖలను తగ్గించాల్సిన అవసరంగానీ, ఆ ఆలోచనగానీ లేవని అన్నారు. దేశ వ్యాప్తంగా సుమారు లక్ష గ్రామాలకు సేవలు అందించమే లక్ష్యంగా ఎంచుకున్నామని తెలిపారు. ఈ దిశగా ముందుకు వెళుతున్నామని వివరించారు.