బిజినెస్

మార్కెట్‌దీ అదే తీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 18: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈవారం లావాదేవీలకు మొదటి రోజైన సోమవారం పాత కథే పునరావృతమైంది. వరుసగా ఎనిమిదో సెషన్ కూడా ట్రేడింగ్ నష్టాలను చవిచూసింది. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో స్టాక్ మార్కెట్‌కు సమస్యలు తప్పలేదు. విదేశీ నిధుల రాక స్థిరంగా కొనసాగినప్పటికీ, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన మదుపరులను తమ వద్ద ఉన్న స్టాక్స్ అమ్మకాలకు ప్రేరేపించింది. కొనుగోళ్ల పట్ల ఎవరూ ఆసక్తిని ప్రదర్శించకపోవడంతో, అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా సెనె్సక్స్ 310.51 పాయింట్లు (0.87 శాతం) పతనమై, 35,498.44 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగింది. 83.45 పాయింట్లు (0.78 శాతం) నష్టపోయిన నిఫ్టీ 10,640.95 పాయింట్లకు పడిపోయింది. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఫార్మా రంగాలకు చెందిన స్టాక్స్ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రుణగ్రహీతలకు వడ్డీ రేట్ల సవరణ అంశంపై ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉన్నతాధికారులతో ఈవారం చర్చలు జరుపుతామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఈ ప్రకటన ఫలితంగానే, బ్యాంకింగ్ రంగ షేర్ల ధర పతనమైంది. ఈవారం మొదట్లో వడ్డీ రేటును 0.25 శాతం తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో వడ్డీ రుణదాతలకు చెల్లించే వడ్డీరేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. అయితే, అన్ని బ్యాంకులు ఈ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ఆర్‌బీఐ వంటి ఒకటిరెండు బ్యాంకులు వడ్డీ రేటును 0.25 శాతం కాకుండా, నానమాత్రంగా 0.05 శాతం మాత్రమే తగ్గించాయి.
ఇలావుంటే, సోమవారం నాటి ట్రేడింగ్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) 2.91 శాతం, ఎస్ బ్యాంక్ 2.54 శాతం, ఐటీసీ 1.95 శాతం, సన్ ఫార్మా 1.94 శాతం, రిలియన్స్ 1.91 శాతం, కోల్ ఇండియా 1.74 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.26 శాతం, ఎస్‌బీఐ 1.22 శాతం, మారుతీ సుజికి 1.17 శాతం, హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) 1.16 శాతం చొప్పున నష్టపోయాయి. అయితే, ఓఎన్‌జీసీ (1.18 శాతం), టాటా మోటార్స్ (1.18 శాతం), యాక్సిస్ బ్యాంక్ (0.70 శాతం), వేదాంత (0.61 శాతం), ఎన్‌టీపీసీ (0.48 శాతం) స్టాక్స్ లాభాల్లో ట్రేడయ్యాయి. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో భారతి ఇన్‌ఫ్రా 3.31 శాతం, జీ ఎన్‌టర్‌టైనె్మంట్ 1.76 శాతం, ఓఎన్‌జీసీ 0.98 శాతం, ఎన్‌టీపీసీ 0.88 శాతం చొప్పున లాభపడ్డాయి. టీసీఎస్ (2.93 శాతం), ఎస్ బ్యాంక్ (2.49 శాతం), ఇండియాబుల్స్ (2.48 శాతం), బజాజ్ ఫిన్‌సర్వ్ (2.33 శాతం), కోల్ ఇండియా (2.18) స్టాక్స్ నష్టాలను చవిచూశాయి.
భారత్, పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్టాక్ మార్కెట్‌ను ప్రభావతం చేసిన పలు అంశాల్లో ఇది కూడా ఒకటి. రూపాయి మారకపు విలువ బలపడకపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం వంటి అంశాలు కూడా సెనె్సక్స్ పతనానికి కారణమయ్యాయి. వీటికితోడు చైనా, అమెరికా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు లేకపోవడం కూడా భారత స్టాక్ మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టింది. ఈ పరిస్థితి ఇంకెంత కాలం కొనసాగుతుందో? స్టాక్ మార్కెట్ ఎప్పుడు కుదుటపడుతుందో? అన్న ప్రశ్నలు ఇనె్వస్టర్లను, స్టాక్ బ్రోకర్లను ఒకే రకంగా వేధిస్తున్నాయి.