బిజినెస్

ఐదు ట్రిలియన్ డాలర ఆర్థిక వ్యవస్థగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఫిబ్రవరి 21: భారత ఆర్థిక రంగం బలమైనదని, రానున్న రోజుల్లో మార్కెట్ సైజు ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రపంచం మొత్తం మీద మరే ఇతర దేశం కూడా భారత్ లాగా సాలీనా ఏడు శాతం వృద్ధిరేటును సాధించడం లేదన్నారు. భారత్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామిక వేత్తలను కోరారు. గురువారం ఇక్కడ భారత్ కొరియా వాణిజ్య సంబంధాలపై జరిగిన సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో దాదాపు ఆరు వందల కొరియన్ కంపెనీలు పాల్గొన్నాయి. హైందాయ్, శాంసంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సంస్థలు హాజరయ్యాయి. ఈ కంపెనీలు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇంకా పెద్ద ఎత్తున సంస్థలు భారత్‌కు తరలిరావాలని ఆయన కోరారు. దక్షిణ కొరియా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు విమానాశ్రయంలోనే వెంటనే వీసా ఇచ్చే విధానాన్ని గత ఏడాది ప్రవేశపెట్టామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. త్వరలోనే భారత్ ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారనుంది అని ఆయన అన్నారు. పారిశ్రామిక, వాణిజ్య రంగం పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం సరళీకృత విధానాలు ప్రవేశపెట్టామన్నారు. వస్తు సేవా పన్నుకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రపంచంలో 77వ స్థానంలో భారత్ నిలిచిందన్నారు. వచ్చే ఏడాది 50వ స్థానానికి చేరుకోనున్నట్లు చెప్పారు. విదేశీపెట్టుబడులకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తున్నామన్నారు. గత నాలుగేళ్లలో భారత్‌కు 250 బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 2.5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉందన్నారు. భావసారూప్యత ఉన్న సంస్థలు, దేశాలతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2018లో భారత్, కొరియా దేశాలు 21.5 బిలియన్ డాలర్ల వ్యాపారం చేశాయన్నారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలవుతోందన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక ఒప్పందం ట్రేడ్‌ను 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. భారత్‌లో 300 మిలియన్ల ప్రజలు బ్యాంకు అకౌంట్లను తెరిచారన్నారు. ఇందులో 12 బిలియన్ డాలర్ల సొమ్ము డిపాజిట్ అయిందన్నారు. ప్రపంచ స్థాయి వౌలిక సదుపాయాల వ్యవస్థను నెలకొల్పుతున్నామన్నారు. భారత్, కొరియాల ఉమ్మడి స్టార్టప్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణ కొరియా జాతీయ ఐటీ ప్రమోషన్ ఏజన్సీని ఇప్పటికే బెంగళూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాయన్నారు.