బిజినెస్

ఈపీఎఫ్ వడ్డీ 8.65 శాతానికి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రిటైర్డ్ ఉద్యోగుల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 2018-19 సంవత్సరానికి గాను 8.65 శాతంగా నిర్ణయించినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. గత ఏడాది ఇది 8.55 శాతం ఉండగా, ఈ ఏడాది స్వల్పంగా పెంచినట్టు చెప్పారు. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటి)తో జరిగిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరినట్టు ఆయన చెప్పారు. తుది ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నట్టు ఆయన తెలిపారు. గత ఐదేళ్లుగా చూస్తే 2017-18 సంవత్సరానికి అతి తక్కువ వడ్డీ శాతం 8.55 శాతం ఉన్నందున వచ్చే ఎన్నికల నేపథ్యంలో దీనిని ఎక్కువగా పెంచుతారని పీఎఫ్ డిపాజిటర్లు ఆశించారు. దీనిని కేవలం 8.65 శాతానికి మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో కార్మిక వర్గాల్లో నిరాశ ఎదురైంది.