బిజినెస్

స్పైస్ పార్కులతో రైతులకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: స్పైస్ పార్కుల అవసరం దేశానికి ఎంతో ఉందని, వీటి వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో, స్పైస్ పార్కులుసహా సుమారు 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆయన ఇక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పైస్ పార్కుల ఆవస్యకత ఉందని వ్యాఖ్యానించారు. రైతులకు, ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి చేసే వారికి వీటి వల్ల ఎంతో మెలు జరుగుతుందని చెప్పారు. ప్రొడక్షన్, ప్రాసెసింగ్ ఒకే చోట ఉండడం, దానికి తోడు నైపుణ్యాన్ని పెంచుకుందుకు శిక్షణ లభించడం రైతులకు అదనపు బలాన్నిస్తుందని పేర్కొన్నారు. కాగా, ప్రపంచంలోనే సుగంధ ద్రవాయల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఓ) జాబితాలోని 109 రకాల సుగంధ ద్రవ్యాల్లో 65 రకాలను భారత్ ఉత్పత్తి చేస్తున్నది. మొత్తం ప్రపంచ స్పైసెస్ మార్కెట్‌లో పరిమాణం పరంగా 46 శాతం, విలువ పరంగా 43 శాతం భారత్ వాటాను కలిగి ఉంది. స్పైస్ పార్కులను నెలకొల్పడం ద్వారా ఉత్పత్తిని మరింత పెంచవచ్చన్నది కేంద్రం ఆలోచన. ఇలావుంటే, మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం కర్నాటకలోని ఉడిపిలో నైపుణ్యానికి సంబంధించిన కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ని ప్రారంభించారు. అదే విధంగా కొయంబత్తూరులో సీఎఫ్‌సీకి శంకుస్థాపన చేశారు. రాజస్థాన్‌లోని కోట, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నగరాల్లో స్పైస్ పార్కులను ప్రారంభించారు. కోట (అస్సాం), భోపాల్ (మధ్యప్రదేశ్)లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ క్యాంపస్‌లను కూడా మంత్రి ప్రారంభించారు. అదే విధంగా కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)తోపాటు న్యూఢిల్లీలోని మైదాన్‌గర్హీలోనూ ఆయన ఐఐఎఫ్‌టీ క్యాంపస్‌లను కూడా ఆయన ప్రారంభించారు. చత్తీస్‌గఢ్‌లోని బానూర్‌లో, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో ఆయన ఫుట్‌వేల్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) శాఖలను ప్రారంభించారు. సంప్రదాయబద్ధమైన బంగారు నగలు, ఇతర ఆభరణాల తయారికి ఉడిపి ప్రసిద్ధి. ఆ ప్రాంతంలో సుమారు 1,200 యూనిట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమకు అవసరమైన శిక్షణకు, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి సురేష్ ప్రభు ప్రారంభించిన సీఎఫ్‌సీ దోహదపడుతుంది. అదే విధంగా కుందన్, మీనాకరి, బిద్రీ, టెంపుల్ జ్యువెలరీ, ఫిగ్రీ, జడావ్ జ్యువెలరీలకు కొయంబత్తూరు పెట్టింది పేరు. ఆభరణాల తయారీ రంగంలోనే కనీసం 50,000 మంది పని చేస్తున్నారంటే, కొయంబత్తూరులో దీనికి ఉన్న ప్రాధాన్యతను ఊహించుకోవచ్చు. సీఎఫ్‌సీ, ఐఐఎఫ్‌టీ, ఎఫ్‌డీడీఐతోపాటు, స్పైస్ పార్కులను కూడా ప్రారంభించి, జాతికి అంకితం ఇవ్వడం ద్వారా ఒక కొత్త శకానికి నాంది పలికినట్టు అయింది.