బిజినెస్

మరో రెండేళ్లు ఆగాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 23: దేశంలో 12 జాతీయ బ్యాంకులను (పీఎస్‌బీ) ఆర్థికంగా పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వనున్నాయి. కాని ఈ బ్యాంకులకు పెద్దమొత్తంలో మొండి బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. దీని వల్ల సానుకూల ఫలితాలు రావడం లో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు రూ.48,239 కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో బ్యాంకులను ఆర్థికంగా బలోపే తం చేయనున్నారు. ఈ వివరాలను ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. బ్యాంకులకు మొదట అనుకున్నట్లుగా రూ.65 వేల కోట్లను కేటాయించాల్సి ఉంది. కాగా ఆ తర్వాత ప్రణాళికను మార్చి రూ.41,000 కోట్ల నుంచి రూ.1.06 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వివరాలను రేటింగ్ ఏజన్సీ మూడీ వెల్లడించింది. బ్యాంకులను ఆర్థికం గా బలోపేతం చేయాలన్న కేంద్రం లక్ష్యం బాగానే ఉన్నా, మొండి బకాయిలతో జాప్యమవుతోంది. అనుకున్నట్లుగా ప్రణాళిక అమలు కావ డం లేదని మూడీస్ పేర్కొంది. అనేక కేసులను ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీ పరిష్కరిస్తోంది. నిరర్థక ఆస్తుల విలువను త గ్గించేందుకు కసరత్తు ప్రారంభమైంది. దివాలా ప్రక్రియ చ ట్టం కింద ఎన్‌సీఎల్‌టీ కేసులను విచారిస్తోంది. కాని తాజా గా కేంద్రం విడుదల చేసిన నిధుల వల్ల బ్యాంకులు బాలారిష్టాల నుంచి గటెక్కి లాభాలబాటపట్టే అవకాశాలున్నా యి. మధ్య,చిన్న తరహా పరిశ్రమలకు చెందిన మొండి బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బకాయిలు పేరుకుపోయి ఉన్న బ్యాంకులు గట్కెక్కే పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.25వేల కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది.