బిజినెస్

శ్రీలంకతో జాయింట్ వెంచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: శ్రీలంక తెలంగాణ మధ్య వ్యాపార సంబంధాలు పెంచుకోవడానికి గల అవకాశాలపై ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు శ్రీలంకలోని భారత హై కమీషనర్ వైకె సిన్హాతో చర్చించారు. శ్రీలంక పర్యటనలో ఉన్న కెటిఆర్ వైకె సిన్హాతో గురువారం సమావేశం అయ్యారు. కొలంబో, హైదరాబాద్ ల మధ్య నేరుగా విమన సౌకర్యంపై చర్చించారు. శ్రీలంక కంపెనీలతో హెల్త్‌కేర్, ప్రత్యామ్నాయ ఇందన వనరులు, టూరిజం రంగాల్లో జాయింట్ వెచర్లు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరారు. భారత హై కమీషన్ నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలకు కమీషనర్ హామీ ఇచ్చారు. కమీషనర్ భేటీ తర్వాత మంత్రి పలు కంపెనీలతో భేటీ అయ్యారు. జాన్ కీల్స్ కంపెనీ ప్రతినిదులతో భేటీ అయిన మంఅథి తెలంగాణలో వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించారు. శ్రీలంకలో జాన్‌కీల్స్ కంపెనీకి పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్, లాజిస్టిక్ వ్యాపారం ఉంది. తమ కంపెనీ తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు కెటిఆర్‌కు తెలిపింది. కంపెనీతో పాటు మలేషియా దేశపు పేరక్ రాష్ట్ర ముఖ్యమంత్రి జాంబ్రీ అబ్దుల్ ఖదీర్‌తో కెటిఆర్ కొలంబియాలో సమావేశం అయ్యారు. మలేషియా పర్యటన సందర్భంగా చర్చించిన పలు అంశాలను మంత్రి కెటిఆర్ జాంబ్రీతో చర్చించారు. శ్రీలంకలో 20 గార్మెంట్ ఫ్యాక్టరీలు ఉన్నా హైద్రమణి కంపెనీ ప్రతినిధులతో కెటిఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులను పెట్టాల్సిందిగా కెటిఆర్ కోరారు.