బిజినెస్

సింగరేణి సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కొత్తగూడెం/గోదా వరిఖని, డిసెంబర్ 1: ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్‌తో ముగిసిన మొదటి 8నెలల్లో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి సంస్థ తన చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపులో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఏప్రిల్ నుంచి నవంబర్ మాసాంతానికి మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 375 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి నిర్దేశిత 346 లక్షల టన్నులను అధిగమించి 108 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. సింగరేణి చరిత్రలో ఇదే ప్రథమమని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. కాగా, వివిధ విద్యుత్ తదితర పరిశ్రమలకు ఎఫ్‌ఎస్‌ఎ (ఇంధన సరఫరా ఒప్పందం) ప్రకారం సరఫరా చేయాల్సిన బొగ్గు 181 లక్షల టన్నులైతే, దీనిని అధిగమిస్తూ 216 లక్షల టన్నుల (120 శాతం)ను చేసి మరో రికార్డు సృష్టించింది. అదేవిధంగా నవంబర్‌లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 48.89 లక్షల టన్నులైతే, 52.77 లక్షల టన్నులు ఉత్పత్తి చేసింది. దీంతో సింగరేణి చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి వెలికితీత సాధించిన సింగరేణి కార్మికులను మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ్ధర్ అభినందించారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన నాలుగు నెలల్లో లక్ష్యాలను సాధిస్తూ సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తానికి సింగరేణి సిఎండి శ్రీ్ధర్ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అన్ని ఏరియాల జిఎంలతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ నెలవారి టార్గెట్లతో ఉత్పత్తిని అదిగమించేందుకు చేస్తున్న కృషి సఫలీకృతమవుతోంది. కాగా, ఏరియాల వారీగా కొత్తగూడెం ఏరియా 109 శాతం, ఇల్లెందు ఏరియా 112 శాతం, మణుగూరు ఏరియా 104 శాతం, రామగుండం-1 ఏరియా 98 శాతం, రామగుండం-2 ఏరియా 97 శాతం, రామగుండం-3 ఏరియా 105 శాతం, భూపాలపల్లి ఏరియా 99 శాతం, ఆడ్రియాల ప్రాజెక్టు 52 శాతం, బెల్లంపల్లి ఏరియా 105 శాతం, మందమర్రి ఏరియా 58 శాతం, శ్రీరాంపూర్ ఏరియా 103 శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నాయి. మొత్తంగా భూగర్భ గనుల ఉత్పత్తి లక్ష్యం 90 లక్షల 72 వేల టన్నులకు గాను 67 లక్షల 53 వేల 124 టన్నులు సాధించి 74 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకోగా, ఓపెన్‌కాస్టు గనులు 2 కోట్ల 90 లక్షల 61 వేల టన్నులకుగాను 3 కోట్ల 07 లక్షల 48 వేల 679 టన్నులు సాధించి 106 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకున్నాయి. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ అంతర్గత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60.03 మిలియన్ టన్నులైతే, ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 55 మిలియన్ టన్నుల ప్రభు త్వ లక్ష్యాన్ని అధిగమిస్తున్న సంస్థ అంతర్గత లక్ష్యాన్ని అధిగమించే దిశగానూ పరుగులు పెడుతోంది.

బొగ్గు గని వద్ద సింగరేణి కార్మికులు