బిజినెస్

ప్రధాని గురించి ఏమి మాట్లాడినా సమస్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 11: ప్రధాని నరేంద్ర మోదీపై తాను ఏం చెప్పినా అది సమస్యాత్మకం అవుతుందని త్వరలో ఆర్‌బిఐ గవర్నర్ పదవినుంచి తప్పుకొంటున్న రఘురామ్ రాజన్ అన్నారు. ఇటీవలి కాలంలో రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, కొందరయితే అవి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చేసినవేనంటూ ప్రచారం చేయడం తెలిసిందే. ముఖ్యంగా మత అసహనంపై చర్చ, మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇండియా’ కార్యక్రమంలాంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి.ఈ నేపథ్యంలో బిబిసికిచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజన్ ప్రధాని మోదీపై తానేమి మాట్లాడినా సమస్యాత్మకమవుతుందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘ఈ ప్రశ్నను దాటవేయడమే మంచిదని నేను అనుకుంటున్నాను. ఏం సమాధానం ఇచ్చినా అది సమస్యాత్మకం అవుతుంది. అందువల్ల దాటవేస్తా’ అని రాజన్ చెప్పారు. సెప్టెంబర్ 4న ఆర్‌బిఐ గవర్నర్ పదవినుంచి వైదొలగిన తర్వాత రాజన్ చికాగో యూనివర్శిటీలో ఆర్థిక రంగంలో ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పనున్నారు. ఆర్‌బిఐ గవర్నర్ పదవిలో రెండోసారి కొనసాగాలని అనుకోవడం లేదని, తిరిగి అధ్యాపక వృత్తిలోకి వెళతానంటూ రాజన్ ప్రకటించిన తర్వాత రాజన్ బహిరంగ ప్రసంగాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రెండోసారి ఆ పదవిలో ఆయనను కొనసాగించడానికి ప్రభుత్వం ఇష్టపడకపోవడానికి ఒక కారణమని కొందరు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయాల్లో చేరే ప్రసక్తే లేదని రాజన్ స్పష్టం చేశారు.