బిజినెస్

భారత్, అమెరికా వాణిజ్య యుద్ధం తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: అమెరికా, భారత్ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తప్పదా? ఇప్పటి వరకూ చైనాను మాత్రమే వాణిజ్య పరంగా నూటికినూరు శాతం ప్రత్యర్థిగా భావిస్తున్న అమెరికా, ఇప్పుడు ఆ జాబితాలో భారత్‌ను కూడా చేరుస్తుందా? ఈ ప్రశ్నలు వ్యాపార వేత్తలను, వివిధ పరిశ్రమలతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉన్న వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి. సాధారణ ప్రాధాన్యతా విధానం (జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫెరెనె్సస్/ జీఎస్‌పీ) కింద కొన్ని ఎంపిక చేసిన వస్తుసేవలపై ఇన్నాళ్లూ ఇస్తున్న రాయితీలను ఎత్తివేస్తున్నట్టు అమెరికా చేసిన ప్రకటనే ఈ ఆందోళనకు కారణమైంది. దీని వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదని, అతి తక్కువ రంగాలు మాత్రమే ప్రభావితం అవుతాయని ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ, వాటిని ఎవరూ పూర్తిగా నమ్మడం లేదన్నది వాస్తవం. భారత్ నుంచి అమెరికాకు ఎన్నో రకాల వస్తువులు ఎగుమవుతున్నాయి. వీటిలో చాలా వాస్తువులకు అమెరికా జీఎస్‌పీ ప్రోగ్రామ్ కింద రాయితీలను ఇస్తున్నది. అయితే, తాము ఎగుమతి చేస్తున్న వస్తువులపై భారత్ విపరీతంగా పన్నుల భారం మోపుతున్నదని, కొన్ని వస్తువులపై మార్కెట్ ధర కంటే రెండుమూడు రెట్లు అధికంగా పన్నులు వసూలు చేస్తున్నదని అమెరికా అధ్యక్షుడు ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాము ఎగుమతి చేస్తున్న వస్తువులపై భారత్ భారీగా పన్నులు వసూలు చేస్తున్నప్పుడు, అక్కడి నుంచి దిగుమతయ్యే వస్తువులకు తాము ఎందుకు రాయితీలు ఇవ్వాలని అమెరికాలో పలు వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దీని పర్యవసానంగానే జీఎస్‌పీ కింద రాయితీలు పొందుతున్న కొన్ని వస్తువులను ఆ జాబితా నుంచి తీసివేసినట్టు అమెరికా ప్రకటించడంతో, ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. చైనాతో అమెరికా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నది. చైనా నుంచి దిగుమతి చేసుకునే చాలా వస్తువులపై పన్నును అమాంతం రెండు లేదా మూడు రెట్లు పెంచేసింది. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని చైనా చేసిన ప్రతిపాదనను అమెరికా పట్టించుకోవడం లేదు. అధికారుల స్థాయిలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నేరుగా ట్రంప్‌తోనే చర్చలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, చర్చలకు ట్రంప్ ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. వియత్నాం వేదికగా, అమెరికా బద్దశత్రువైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ యున్‌తో ట్రంప్ సమావేశమయ్యారుగానీ, చైనా అధ్యక్షుడిని మాత్రం కలిసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. చైనా దిగి వచ్చే వరకూ ఇదే పరిస్థితిని అమెరికా కొనసాగిస్తుందనేది ఈ పరిమాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, తమ ఎగుమతులకు వివిధ దేశాల్లో ఎంత మొత్తంలో సుంకాలు వసూలు చేస్తున్నారు?, ఆయా దేశాల నుంచి తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఎంత మొత్తం రాయితీలు ఇస్తున్నాము? అనే ప్రశ్నలను ఏ నాడూ వేసుకోని అమెరికా ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. అందుకే చైనాతో వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఎవరు ఎన్నిరకాలుగా నచ్చచెప్తున్నా వినడం లేదు. చైనా ఏ రకంగా బెదిరిస్తున్నా ఏ మాత్రం జంకడం లేదు. భవిష్యత్తులో ఇదే పరిస్థితి భారత్, అమెరికా మధ్య కూడా నెలకొంటుందన్న అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు తెరతీస్తున్నాయి. మన దేశం నుంచి అమెరికాకు జరుగుతున్న ఎగుమతులు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, అమెరికా దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో అత్యధిక శాతం చైనా, భారత్ నుంచే వెళుతున్నాయి. ఇకపై రెండు దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలను ఇబ్బడిముబ్బడిగా పెంచితే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. అమెరికాతో వాణిజ్య యుద్ధ ఘంటికలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎంత త్వరగా మేలుకుంటే అంత మంచిది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై టారిఫ్‌ను ఎంత తొందరగా మారిస్తే పరిస్థితి అంత త్వరగా చక్కబడుతుంది. లేకపోతే, వాణిజ్య యుద్ధం తీవ్రతరమై, సమస్య చేజారిపోయే ప్రమాదం ఉంది.