బిజినెస్

కాకినాడ-విశాఖ సీ క్రూయిజ్ హుళక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 15: కోస్తా తీరంలో పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కాకినాడ-విశాఖల మధ్య ఏర్పాటు చేయనున్న సీ క్రూయిజ్(పర్యాటక ప్రాంతాలను చూపించే ప్రత్యేక నౌక) ప్రారంభానికి నోచుకోలేదు. విశాఖలో నౌకను నిలిపి ఉంచేందుకు కేటాయించిన జెట్టీ వివాదంలో చిక్కుకోవడంతో సీ క్రూయిజ్ ముందుకు సాగడం లేదు. కోస్తాంధ్రలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తొలిసారిగా విశాఖ-కాకినాడల మధ్య సీ క్రూయిజ్‌ను ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ క్రూయిజ్ నిర్వహణకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది.
ఇప్పటి వరకూ రివర్ క్రూయిజ్‌లను మాత్రమే నిర్వహిస్తున్న పర్యాటక శాఖ.. సీ క్రూయిజ్‌ను తొలిసారిగా చేపడుతోంది. 40 మందితో ప్రయాణించే ఈ నౌక అద్దాలతో నిర్మించనున్నారు. తూర్పు కనుమల అందాలు, సముద్ర అందాలను వీక్షించేందుకు వీలుగా అద్దాలతో ఉన్న నౌకను వినియోగించనున్నారు. విశాఖ, కాకినాడల మధ్య 70 నాటికల్ మైళ్ల (130 కిలోమీటర్ల) దూరం ఉంటుంది.
దాదాపు నాలుగు గంటల్లో ఈ దూరాన్ని అధిగమించేలా ఏర్పాట్లు చేశారు. కాకినాడ ఉప్పాడలోని లైట్ హౌజ్ జెట్టీ వద్ద ఈ నౌకను నిలిపి ఉంచేందుకు వీలు కల్పించారు. విశాఖలో ఫిషింగ్ హార్బర్‌లోని స్పిల్‌వే జెట్టీ వద్ద ఈ నౌకలను నిలిపి ఉంచేందుకు వీలుగా ఆ జెట్టీని అభివృద్ధి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ఈ జెట్టీని లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు కూడా. దీంతో విశాఖ-కాకినాడల మధ్య ట్రయల్ రన్ నిర్వహించి ఆ తరువాత లాంఛనంగా ప్రారంభించేందుకు పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ విశాఖలోని ఫిషింగ్ హార్బర్ వద్ద నౌకను నిలిపేందుకు మత్స్యకారులు అభ్యంతరం తెలిపారు.
తమ జీవనోపాధి దెబ్బతింటుందంటూ వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ క్రూయిజ్‌కు ట్రయల్ రన్ నిర్వహించాల్సిన తరుణంలో బ్రేక్ పడింది. పరిస్థితిని మత్స్యకారులకు వివరించేందుకు అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోకపోవడంతో ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మరోవైపు కాకినాడ-విశాఖల మధ్య సీ క్రూయిజ్‌తో పాటు విశాఖ నుంచి దాదాపు అరగంట సేపు సముద్రంలో పర్యాటకులను తిప్పి తీసుకువచ్చేందుకు వీలుగా కూడా బోట్లను నడిపేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. దానికీ ఇదే పరిస్థితి. కాగా, విశాఖ-చెన్నైల మధ్య, విశాఖ నుంచి ఇతర దేశాలకు క్రూయిజ్ సర్వీసును ప్రారంభించేందుకు ఒక విదేశీ సంస్థ కూడా ఆసక్తి చూపడం గమనార్హం. మొత్తానికి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించకపోవడంతో మరింత జాప్యం కానుంది.