బిజినెస్

లాభాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 8: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, వాణిజ్య యుద్ధ వాతావరణం భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఫలితంగా నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్, జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ స్వల్పంగా పతనమయ్యాయి. ఈవారం స్టాక్ మార్కెట్ లావాదేవీలకు చివరి రోజురైన శుక్రవారం సెనె్సక్స్ 53.99 పాయింట్లు (0.15 శాతం) పతనం కావడంతో, 36,671.43 పాయింట్లకు చేరంది. నిఫ్టీ 22.80 పాయింట్లు (0.21 శాతం) పడిపోయి, 11,035.40 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ, మెంటల్ కంపెనీల స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ కావడం, మదుపరుల నుంచి అమ్మకాల ఒత్తిళ్లు పెరగడం ఈ పతనానికి కారణంగా పేర్కోవాలి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో నష్టపోయిన కంపెనీల్లో టాటా మోటర్స్ మొదటి స్థానంలో ఉంది. ఈ కంపెనీ షేర్లు ధర ఏకంగా 3.99 శాతం పడిపోయింది. ఇతర షేర్ల విషయానికి వస్తే, హెచ్‌సీఎల్ టెక్ 2.53 శాతం, టాటా స్టీల్ 2.43 శాతం, వేదాంత 2.02 శాతం, ఇన్ఫోసిస్ 1.48 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. కాగా, ప్రతికూల పరిస్థితులను కూడా సమర్థంగా ఎదుర్కొన్న ఎన్‌టీపీసీ లాభాల బాటలో నడిచింది. ఈ కంపెనీ షేర్లు 4.28 శాతం లాభాలను ఆర్జించాయి. బాజాజ్ ఆటో 1.38 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.13 శాతం, సన్ ఫార్మా 0.92 శాతం, ఐటీసీ 0.69 శాతం చొప్పున లాభపడ్డాయి. నిఫ్టీలో లాభాలను సంపాదించిన కంపెనీల జాబితాలోనూ ఎన్‌టీపీసీ అగ్రస్థానాన్ని ఆక్రమించడం విశేషం. ఆ కంపెనీ షేర్లు 4.10 శాతం లాభాలను సంపాదించాయి. ఇచర్ 1.62 శాతం, గ్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) 1.60 శాతం, అల్ట్రాటెక్ 1.51 శాతం, బజాజ్ ఆటో 1.23 శాతం చొప్పున లాభాలను సొంతం చేసుకున్నాయి. కాగా, బీఎస్‌ఈలో మాదిరిగానే, ఎన్‌ఎస్‌ఈలోనే టాటా మోటార్స్‌కు భారీ నష్టం తప్పలేదు. ఈ కంపెనీ షేర్లు 4.28 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. విప్రోకు కూడా అమ్మకాల ఒత్తిళ్లు తప్పలేదు. ఫలితంగా 4.15 శాతం నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. టాటా స్టీల్ 2.55 శాతం, హిందాల్‌కో 2.52 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.46 శాతం నష్టాలను ఎదుర్కొన్నాయి.
వివిధ రంగాలను పరిగణలోకి తీసుకుంటే, శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో మెటల్ సూచీలు దారుణంగా పడిపోయాయి. 1.57 శాతం నష్టం నమోదైంది. ఐటీ, టెక్నాలజీ రంగాలు కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా స్వల్పంగా పతనమయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి, నష్టాలు స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీశాయి. విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో, ఒకానొక దశలో పతనం మరీ దారుణంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమైంది. అయితే, చివరిలో దేశీయ మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపి, స్టాక్ మార్కెట్‌ను భారీ నష్టాల నుంచి తప్పించారు. కొద్దిపాటి నష్టంతోనే ట్రేడింగ్ బయటపడేందుకు సహకరించారు. రూపాయి మారకపు విలువ నిలకడగా లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర స్వల్పంగా పెరడం కూడా భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి.