బిజినెస్

అశోక్ లేలాండ్‌కు భారీ ఆర్డర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 8: అశోక్ లేలాండ్‌కు గుజరాత్ నుంచి భారీ ఆర్డర్ లభించింది. అక్కడి రోడ్డు రవాణా కార్పొరేషన్ (జీఎస్‌ఆర్‌టీసీ) నుంచి 1,200 బస్సుల సరఫరాకు ఆర్డర్‌ను పొందింది. దీనితో ఇటీవల కాలంలో మొత్తం 2,580 బస్సులకు ఆర్డర్లు లభించినట్టు హిందూజా గ్రూప్‌లోని ఒక విభాగమైన అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కే. దాసరి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్‌ఆర్‌టీసీ నుంచి ఈ ఆర్డర్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు చేతికి అందడం ఎంతో ఆనందాన్నిస్తున్నదని పేర్కొన్నారు. అవసరాలతోపాటు, పర్యావరణ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాలను తయారు చేస్తున్నామని, అందుకే, దేశంలో వాహన తయారీలో తమ కంపెనీ అగ్రస్థానంలో ఉందని వినోద్ తెలిపారు. త్వరలోనే ఆర్డర్ల సంఖ్య 3,000 బస్సులకు చేరుతుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ సారస్వత్ మరో ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. తమపై ఉన్న నమ్మకానికి, విశ్వసనీయతకు జీఎస్‌ఆర్‌టీసీసహా ఇప్పుడు వస్తున్న ఆర్డర్లు నిదర్శనమని వ్యాఖ్యానించారు.