బిజినెస్

లాభసాటి ట్రేడింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 9: ఈవారం స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను పరిశీలిస్తే, ట్రేడింగ్ లాభసాటిగా సాగిందనే చెప్పాలి. సోమవారం మహాశివరాత్రి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లావాదేవీలు జరగలేదు. ఆతర్వాత వరుగా మూడు రోజుల ట్రేడింగ్ మదుపరులకు లాభాలను ఆర్జించిపెట్టింది. అయితే, వ్యాపారానికి చివరి రోజైన శుక్రవారం మాత్రం స్వల్ప నష్టాలను ఎదుర్కొంది. స్థూలంగా చూస్తే, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ వాతావరణం తదితర అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావానే్న చూపాయి. గత వారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈవారం వరుసగా మూడు రోజులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, సెనె్సక్స్ లాభాలను నమోదు చేయడం విశేషం. నాలుగు రోజుల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడిన నేపథ్యంలో, బీఎస్‌ఈలో సెనె్సక్స్, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ పాయింట్లు పతనమయ్యాయి. 36,063.81 పాయింట్లతో మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ను ప్రారంభించిన బీఎస్‌ఈ ఏకంగా 378.73 పాయింట్ల లాభాన్ని ఆర్జించి, 36,442.54 పాయింట్లకు చేరింది. నిఫ్టీ కూడా 123.95 పాయింట్లు లాభపడడంతో, 10,987.45 పాయింట్లకు పెరిగింది. వారం ఆరంభంలోనే నమోదైన లాభం ఆతర్వాత వరుసగా రెండు రోజులు కొనసాగింది. బుధవారం సెనె్సక్స్ 193.56 పాయింట్ల లాభంతో 36,636.10 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 65.55 పాయింట్ల లాభంతో 11,053.00 పాయింట్లకు పెరిగింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో సూచీల పతనం కొనసాగిన నేపథ్యంలో, గురువారం భారీ నష్టాలు తప్పవేమోనన్న అనుమానం తలెత్తింది. చివరి వరకూ లాభనష్టాల్లో ఊగిసిన లాడిన మార్కెట్ చివరికి స్వల్ప లాభాలతోనే ముగిసింది. సెనె్సక్స్ 89.32 పాయింట్లు పెరిగి 36,725.42 పాయింట్లకు, నిఫ్టీ 5.20 పాయింట్లు పెరిగి 11,058.20 పాయింట్లకు చేరాయి. కాగా, ఈవారం ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం కూడా ప్రతికూల పరిస్థితులే కనిపించాయి. అమ్మకాల ఒత్తిళ్లు పెరిగాయి. అటు విదేశీ మదుపరులు, ఇటు దేశీయ పెట్టుబడిదారులు ఆసక్తిని ప్రదర్శించకపోవడంతో, ఐటీ, మెటల్ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ప్రపంచ మార్కెట్ సూచీలకు ఎదురీది, లాభాలను ఆర్జించడం సాధ్యం కాకపోయినప్పటికీ, సంస్థాగత పెట్టుబడిదారులు మద్దతుగా నిలవడంతో, స్వల్ప నష్టాలతో సరిపుచ్చుకుంది. సెనె్సక్స్ 53.99 పాయింట్లు పతనంకాగా, 36,671.43 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 22.90 పాయింట్ల పడిపోయి, 11,035.40 పాయింట్లుగా నమోదైంది. మొత్తం మీద ఈ వారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసిందనే చెప్పాలి. వారం మొత్తాన్ని చూస్తే, సెనె్సక్స్ 607.62 పాయింట్లు (1.68 శాతం), నిఫ్టీ 171.90 పాయింట్లు (1.58 శాతం) పెరిగాయి.