బిజినెస్

వంట నూనెల ఎగుమతుల్లో నిలకడ లేమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: దేశం నుంచి జరుగుతున్న వంట నూనెల ఎగుమతుల్లో నిలకడ లోపించింది. ఒక్కోసారి గణనీయంగా పెరగడం, ఒక్కోసారి అనూహ్యంగా పతనం కావడంతో, మార్కెట్‌లో వంట నూనె ఎగుమతుల అంశంపై ఆందోళన నెలకొంది. గత ఏడాది జనవరితో పోల్చి చూసినా, గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగిన ఎగుమతులను పరిశీలించినా, ఈ ఏడాది జనవరిలో వంట నూనెల ఎగుమతి ఆశాజనకంగానే ఉంది. అయితే, ఏడాది మొత్తం మీద పరిస్థితిని పరిశీలిస్తే, నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తున్నది. గత ఏడాది జనవరిలో 12.91 లక్షల టన్నుల వంట నూనెలు ఎగుమతయ్యాయి. ఫిబ్రవరిలో 11.57 లక్షల టన్నులు, మార్చిలో 11.46 లక్షల టన్నులు చొప్పున వంట నూనెలు వివిధ దేశాలకు ఎగుమతయ్యాయి. అయితే, ఏప్రిల్‌లో, ఎవరూ ఊహించని విధంగా 13.86 లక్షల టన్నులకు పెరిగింది. ఆ వెంటనే, మేలో 12.85 లక్షల టన్నులకు పడిపోయింది. జూన్‌లో మరింతగా పతనమై 10.42 లక్షల టన్నులకు చేరింది. అనంతరం కొంతమేర సానుకూల ధోరణులు ఏర్పడడంతో, జూలైలో 11.20 లక్షల టన్నులకు పెరిగింది. ఆగస్టులో ఏకంగా 15.13 లక్షల టన్నులుకాగా, సెప్టెంబర్ మాసంలో రికార్డు స్థాయిలో 14.91 లక్షల టన్నులకు చేరింది. గత ఏడాది ఎగుమతుల్లో ఇదే అత్యధికం. అక్టోబర్ మాసంలో మళ్లీ పతనం మొదలై, 12.56 లక్షల టన్నులుగా నమోదుకాగా, నవంబర్‌లో మరింతగా తగ్గి, 12.49 లక్షల టన్నులకు పడిపోయింది. డిసెంబర్‌లో కొద్దిగా కోలుకొని 12.11 లక్షల టన్నులకు చేరింది. ఈ ఏడాది ఆరంభం, జనవరిలో 12.75 లక్షల టన్నుల వంట నూనెల ఎగుమతి జరిగింది. మొత్తం మీద ఏడాది కాలంలో ఎగుమతుల తీరుతెన్నులను గమనిస్తే, నిలకడలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వంట నూనెల ఎగుమతులు సహజంగా దేశీయ వ్యావసాయోత్పత్తులపై ఆధారపడుతుంది. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో సానుకూలత కనిపిస్తేనే, వంట నూనెల ఉత్పత్తి, తత్ఫలితంగా ఎగుమతులు పెరుగుతాయి. వ్యవసాయ రంగ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి. వివిధ రకాలపై చమురు ఉత్పత్తి, అమ్మకాల టారిఫ్‌ను కేంద్రం మార్చింది. సవరించిన టారిఫ్ రేట్ల ప్రకారం, వసూలు చేస్తున్న మొత్తాలు మారాయి. తాజా టారిఫ్ ప్రకారం మెట్రిక్ టన్నుకు వసూలు చేస్తున్న మొత్తాలు అమెరికా డాలర్లలో ఇలావున్నాయి. ముడి పామ్ ఆయిల్ 575 డాలర్లు, ఆర్‌బీడీ పామ్ ఆయిల్ 607 డాలర్లు, ఇతర పామ్ ఆయిల్ 591 డాలర్లు, ముడి పామోలిన్ 608 డాలర్లు, ఆర్‌బీడీ పామోలిన్ 611 డాలర్లు, ఇతర పామోలిన్ 610 డాలర్లు, ముడి సోయాబీర్ ఆయిల్ 758 డాలర్లు. ఇలావుంటే, మెట్రిక్ టన్ను బ్రాస్ స్క్రాప్ (అన్ని గ్రేడ్స్ కలిపి) 3,596 డాలర్లు, పప్పీ సీడ్స్ 2,576 డాలర్లు, అరెకా నట్స్ 3,925 డాలర్లుగా టారిఫ్ ఉంది. కాగా, పది గ్రాముల బంగారం టారిఫ్ 422 డాలర్లుకాగా, కిలో వెండికి 503 డాలర్లుగా ఖాయం చేశారు.