బిజినెస్

ఖాతాదారులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: ఉద్యోగం మారిన ప్రతిసారీ క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా కొత్త సంస్థ వివరాలు సమర్పించడం వంటి బాధ్యతల నుంచి ఈపీఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఊరట లభించనుంది. ఉద్యోగం మారినప్పుడు క్లెయిమ్స్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవనవసరం లేకుండానే, నేరుగా సంబంధిత ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు జమ చేసేందుకు అవసరమైన కొత్త సాంకేతిక విధానాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సిద్ధం చేస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ఈ విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఒక ఉద్యోగి రిటైరైనప్పుడు, అప్పటి వరకూ జమ అయిన మొత్తాలను తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది.
అయితే, ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థకు వెళ్లినప్పుడు క్లెయిమ్స్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఏటా సుమారు ఎనిమిది లక్షల ట్రాన్స్‌ఫర్ క్లెయిన్స్ అందుతున్నట్టు ఈపీఎఫ్‌ఓ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిని పరీశించి, పరిష్కరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రతి ఖాతాదారుడికీ యూనివర్శల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఉన్నప్పటికీ, ఉద్యోగం మారినప్పుడు క్లెయిమ్స్ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రవేశపెట్టబోయే కొత్త విధానాన్ని పూర్తిగా యాంత్రికీకరణ చేసినట్టు ఈపీఎఫ్‌ఓ తన ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, లోటుపాట్లను సరిచూసుకున్న తర్వాత, పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని వివరించింది. ఇప్పటికే 80 శాతం వరకూ పనులు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నదని తెలిపింది. క్లెయిమ్స్‌కు సంబంధించి ఆటోమేటిక్ విధానాన్ని అనుసరించడం వల్ల ఖాతాదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.