బిజినెస్

సెంట్రల్ బ్యాంకు, ఐఓబీ రేటింగ్స్‌లో పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 11: సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంక్‌లకు చెందిన దీర్ఘకాలిక దేశ, విదేశీ కరెన్సీ డిపాజిట్ల ఆధారంగా ఆ బ్యాంకుల రేటింగ్స్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ అప్‌గ్రేడ్ చేసింది. ఈ రేటింగ్‌ను బిఏ-2 నుంచి బీఏ-3కి పెంచినట్టు మూడీస్ సోమవారం నాడిక్కడ తెలిపింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరాబ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన దేశ, విదేశీ కరెన్సీ డిపాజిట్ల రేటింగ్‌లను సైతం ఈ ఏజెన్సీ బీఏఏ-3/పీ-3గా పునర్‌వ్యవస్థీకరించింది. ఇప్పటి వరకు అతి బలహీనమైన రేటింగ్స్ కలిగిన సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంక్ రేటింగ్ పెరగడం వల్ల ఆ బ్యాంకుల సాల్వెన్సీని పెంచుకునేందుకు వీలుకలుగుతుందని, అలాగే మూలధనం పెంచుకునేందుకు అవసరమైన కేంద్ర సాయాన్ని పొందడానికి అవకాశం కలుగుతుందని మూడీస్ సోమవారం నాడిక్కడ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు బ్యాంకులు కామన్ ఈక్విటీ టయర్-1 లక్ష్యానికి చేరుకుని మార్చి నెలాఖరుకు 8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తాయని ఏజెన్సీ అంచనా వేసింది. గత నెలలో ప్రభుత్వం మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థికాభివృద్ధికోసం 48,200 కోట్ల రూపాయల నిధిని అందజేసింది. ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.4,640 కోట్లు, సెంట్రల్ బ్యాంక్‌కు రూ.2,560 కోట్లు, ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంక్‌కు రూ.3,810 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు రూ.4,110 కోట్లు వంతున అందుకుంటాయి. అలాగే ఐఓబీ రూ.6,690 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ.1,680 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10.090 కోట్లు వంతున కొత్త మూలధనంగా రీకేపిటలైజేషన్ బాండ్ల రూపంలో అందుకున్నాయి. కాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లకు సంబంధించిన రేటింగ్స్‌ను పునర్‌వ్యవస్థీకరించడం వల్ల ఈ మూడు బ్యాంకులు సీఈటీ-1 నిష్పత్తి లక్ష్యాన్ని సులభంగా చేరుకోవడానికి అవకాశం కలుగుతుందని మూడీస్ తెలిపింది. కొత్తగా కేంద్ర నిధులు సహకారం అందినమీదట 2018 డిసెంబర్ ఆర్‌డబ్ల్యుఏ ఆధారంగా బీఓఐ, ఓబీసీ, యూబీఐల సీఈటీ నిష్పత్తి వరుసగా 10.7, 10.2, 9 శాతంగా ఉందని మూడీస్ నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కెనరాబ్యాంకు ఎలాంటి కేంద్ర ఆర్థిక సాయాన్నీ అందుకోలేదు. గడచిన మూడు త్రైమాసికాల్లో కేంద్ర సాయం అందుకున్న ఆరు బ్యాంకులకు సంబంధించిన మొండి రుణ బకారుూల శాతం క్రమంగా తగ్గుతోందని నివేదిక పేర్కొంది. అలాగే 2020 నాటికి ఈ బ్యాంకులులాభాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని విశే్లషించింది.