బిజినెస్

‘బిర్లా’ షేర్లు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: స్టాక్ మార్కెట్‌లో బిర్లా కార్పొరేషన్ షేర్లు సోమవారం దారుణంగా పతనమయ్యాయి. ఇన్‌ట్రా ట్రేడ్‌లో షేర్ ధర పడిపోయింది. చిత్తోర్‌గఢ్‌లో మైనింగ్‌ను నిలిపివేయాల్సిందిగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, బిర్లా కార్పొరేషన్ షేర్లకు డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో 14.11 శాతం పడిపోయింది. దీనితో షేర్ ధరకు 485.10 రపాయల వద్ద ముగిసింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈ కంపెనీ ధర 11.52 శాతం పతనం కావడంతో, 500 రూపాయలకు చేరింది. చిత్తోడ్‌గఢ్ నగరంలో మైనింగ్‌ను వెంటనే నిలిపివేయాల్సిందిగా ఈనెల 8న ఎన్‌జీటీ ఆదేశించినట్టు శనివారం ఫైలింగ్ సమయంలో బిర్లా కార్పొరేషన్ పేర్కొంది. దీనితో సోమవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ మొదలైన మరుక్షణం నుంచే ఆ కంపెనీ షేర్లు పతనమవుతూ వచ్చాయి. చివరి వరకూ అదే ధోరణి కొనసాగింది. స్టాక్ బ్రోకర్లు అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు.
జెట్ ఎయిర్‌వేస్‌కు లాభాలు
జెట్ ఎయిర్‌వేస్ షేర్లు సోమవారం లాభాల్లో ట్రేడయ్యాయి. బీఎస్‌ఈలో 4.68 శాతం పెరిగడంతో ఈ సంస్థ షేర్ ధర 254.50 రూపాయలకు చేరింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో జరిగిన ఎన్‌ట్రా ట్రేడ్‌లో 4.83 శాతం లాభాలను నమోదు చేయడంతో, 255 రూపాయలకు పెరిగింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సుమారు 2,000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. ఈ వార్త బయటకు రావడంతో, సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్న ధీమాతో మదుపరులు ఈ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. ఫలితంగా షేర్ ధర పెరిగింది.