బిజినెస్

గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమిత్‌కు 45 మిలియన్ డాలర్ల ఎగ్జిట్ ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ఫ్రాన్సిస్‌కో, మార్చి 12: టెక్ దిగ్గజం గూగుల్ గతంలో పనిచేసిన భారత సంతతికి చెందిన ఉన్నత కార్యనిర్వాహకుడు అమిత్ సింఘాల్‌కు 45 మిలియన్ డాలర్లు ఎగ్జిట్ ప్యాకేజీ కింద అందజేసేందుకు అంగీకరించింది. సింఘాల్‌పై 2016లో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గూగుల్ సెర్చ్ ఆపరేషన్స్‌లో సింఘాల్ గతంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన సమయంలో ఆయనతో కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందంలో ఎంతసొమ్ము ఇస్తారన్నది వెల్లడి కాలేదు. ఐతే సోమవారం ఇందుకు సంబంధించిన ప్యాకేజీ సొమ్ము వివరాలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారంలో నిందితుడిని శిక్షించాల్సిందిపోయి భారీగా ప్యాకేజీ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఓ వాటాదారు కోర్టును ఆశ్రయించడంతో ప్యాకేజీ విషయం బయటకు వచ్చిందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టులో ఈ లాసూట్ గత జనవరిలో ఫైల్ అయింది. లైంగిక వేధింపుల కేసులో గూగుల్ యాజమాన్యం వ్యవహార శైలిని పిటిషనర్ తప్పుపట్టారు. కాగా సింఘాల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపిన గూగుల్ ఆ సమయంలో ఆయన మద్యం సేవించివున్నారని నిర్ధారించింది. అలాగే ఆయన ఉద్యోగిగా ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొంది. కానీ ఆ సమయంలో తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకున్న సింఘాల్ రాజీనామా చేశారు. కాగా ఆయన పనిచేసిన రెండేళ్ల కాలానికి 15 మిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించేందుకు గూగుల్ ఈ సందర్భంగా అంగీకరించింది. ఇక్కడి నుంచి వైదొలిగిన సంవత్సరం తర్వాత ఊబర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు సింఘాల్ అంగీకరించారు. అయితే మూడో ఏడాదికి మాత్రం పరిహారం చెల్లించేందుకు గూగుల్ అంగీకరించలేదు.