బిజినెస్

పెట్టుబడిదారీ విధానం ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 12: పెట్టుబడిదారీ విధానం తీవ్ర ప్రమాదకరమని, దీనివల్ల ప్రజలకు ఆర్థిక, రాజకీయ పరమైన ప్రయోజనాలు దెబ్బతిని తిరుగుబాటుకు దారితీసే అవకాశాలున్నాయని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. ప్రత్యేకించి 2008 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారిన తీరు సహేతుకంగా లేదని ఆన్నారు. ప్రస్తుతం చికాగో యూనివర్శిటీలోప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాజన్ బీబీసీ రేడియో కార్యక్రమంలో మంగళవారం నాడు మాట్లాడారు. ఆర్థికాభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునే సమయంలోప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కనీసం పక్షం కూడా ప్రజలందరికీ సమాన ఫలాలు అందాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించడం ప్రమాదకరం, ఇందువల్ల అనేకమందికి అవసరమైన ఫలాలు అందకపోవచ్చన్నారు. ఇదే జరిగితే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశాలున్నాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)కు చెందిన మాజీ చీఫ్ ఎకానమిస్ట్ కూడా అయిన రాజన్ హెచ్చరించారు. ఈ విషయంలో సమానత్వాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా ఉన్న మార్క్ కార్నీ నుంచి మరొకరు బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయన్న అంశంపై రాజన్ మాట్లాడుతూ ఒక సాధారణ విద్యార్హతలతో ఒక మధ్యతరహా ఉద్యోగాన్ని పొందేందుకు గతంలో అవకాశాలుండేవని, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అన్నారు. ఇప్పుడు ఉద్యోగానికి తగిన విద్యార్హతలు అవసరమన్నారు. వాణిజ్య ప్రపంచీకరణ, సమాచార వ్యవస్థల కారణంగా దురదృష్ట వశాత్తు సమాజంపై దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ప్రత్యేకించి పాఠశాలల్లో సైతం నేర ప్రవృత్తి పెరగడం, సామాజికపరమైన అసమర్థత చోటుచేసుకోవడం వంటివి చోటుచేసుకోవడంవల్ల ప్రపంచ ఆర్థికాభివృద్ధికి అవసరమైన సన్నద్ధత కొరవడుతోందని రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా రుణాల రేటు 50 శాతానికి చేరితే సమీప భవిష్యత్తులోనే మళ్లీ అంతర్జాతీయ ఆర్థిక సంక్షో భం తలెత్తే అవకాశాలున్నాయని ఎస్ అండ్ పీ అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2008 నుంచి ప్రభుత్వాల అప్పులు 77 శాతానికి చేరగా, కార్పొరేట్ అప్పులు 51 శాతానికి చేరాయని అధ్యయన నివేదిక వెల్లడించిందని ఆయన చెప్పారు.