బిజినెస్

రిలయన్స్ గ్యాస్ సరఫరా పన్ను పెంచిన పీఎన్‌జీఆర్‌బీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: కేజీ-డీ 6 నుంచి రిలియన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన గ్యాస్‌ను వినియోగదారులకు సరఫరా చేసే పన్నులను పెట్రోలియం మరియు సహజవాయువు నియంత్రీకరణ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచే మారిన రేటు అమల్లోకి వస్తుందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. పైప్‌లైన్ పరఫరా కోసం ఇంత వరకూ వసూలు చేస్తున్న మొత్తాన్ని 37 శాతం పెంచుతూ పీఎన్‌జీఆర్‌బీ తీర్మాన్నాన్ని ఆమోదించింది. దీని ప్రకారం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. సాధారణంగా గ్యాస్ సరఫరా రేట్లను మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ) విధానంలో నిర్ధారిస్తారు. కాగా, కొత్తగా నిర్ధారించిన రేట్లను అనుసరించి, ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌కు 71.66 రూపాయలు ఖర్చవుతుంది. ఇంతకు ముందు ఇది 52.33 రూపాయలుగా ఉండేది. ఈ పైప్‌లైన్ నిర్వాహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈస్ట్ వెస్ట్ పైప్‌లైన్ లిమిటెడ్ 70 శాతానికిపైగా టారిఫ్‌ను పెంచాల్సిందిగా కోరింది. అయితే, ఆ సంస్థ డిమాండ్ చేసిన మొత్తంలో దాదాపు సగం వరకూ పెంచుతూ పీఎన్‌జీఆర్‌బీ తీర్మానాన్ని ఆమోదించింది.