బిజినెస్

జనపనార మిల్లు కార్మికులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 14: జనపనార మిల్లు కార్మికు ల సమ్మెను విరమింపజేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంబంధిత పరిశ్రమ వర్గాలతో గురువా రం వేతన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పం దం తక్షణమే అమల్లోకి వస్తుందని సంబంధిత అధికారి ఒకరు వివరించారు, ఈమేరకు కొత్త వర్కర్లకు రోజుకు 385 రూపాయల వేతనం అందుతుంది. ఇప్పటి వరకు ఈ వేతనం రూ. 257గా ఉండేది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఈ మిల్లుల్లో కొత్తగా చేరే కార్మికుల దినసరి వేతనాన్ని రూ. 327 పెం చింది. దీన్ని మధ్యంత భృతిగా అమలు చేయాలని ఆదేశించింది. అలాగే నెలలో 24 రోజుల హాజరుపట్టీ ఉండే కార్మికులకు రోజుకు రూ.385 అందుతుంది. అలాలేని కార్మికులకు రోజుకు 370 రూపాయలు అందాలన్నది ప్రభుత్వ నిబంధన. ఈ క్రమంలో ఈనెల 15 నుంచి కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెను చేపట్టాయి. కనీస వేతన చట్టం ప్రకా రం వేతనాలు ఉండాలన్నది సమ్మె చేపట్టిన 21 కార్మి క సంఘాల డిమాండ్. ఐతే సీఐటీయూ మాత్రం సమ్మెలో పాల్గొనలేదు. లెఫ్ట్ ఫ్రంట్ మద్దతున్న ఆరు కార్మిక సంఘాలూ నూతన వేతన ఒప్పందంపై సంతకాలు చేయలేదు. కాంగ్రెస్ మద్దతున్న ఐఎన్‌టీయూసీ, బీజేపీకి చెందిన బీఎంఎస్, తృణమూల్ కాంగ్రెస్ కార్మిక విభాగం ఐఎన్‌టీటీయూసీ మాత్రం ఈ వేతన ఒప్పందంపై సంతకాలు చేశాయి.