బిజినెస్

సమష్టి నిర్ణయంతోనే జెట్ ఎయిర్‌వేస్‌కు అదనపు రుణ సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 14: ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్‌కు అత్యవసరంగా నిధులు మంజూరు చేసే విషయమై బ్యాంకులు సమష్టి తీసుకోవాల్సిందేకానీ ఒక బ్యాంకు స్వతంత్రించి ఏ నిర్ణయం తీసుకోవడం జరగదని ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు గురువారం నాడిక్కడ స్పష్టం చేసింది. జెట్ ఎయిర్‌వేస్‌కు అత్యవసర నిధుల కింద రూ.2,050 కోట్లు ఇచ్చేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు పం జాబ్ నేషనల్ బ్యాంకు ఆమోదం తెలిపిందని మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో పీఎన్‌బీ పైవిధంగా స్పం దించింది. ‘సశక్త్’ప్రాజెక్టు ద్వారా ఈ నిధులు సమకూర్చేందుకు జరిగిన తీర్మానాన్ని అమలుచేసే విషయం పరిశీలనలో ఉందన్నది ఆ వార్తల సారాం శం. ఐతే స్టాక్ ఎక్చేంజీకి జెట్ ఎయిర్‌వేస్ సమర్పించిన ఫైలింగ్‌లో మాత్రం ‘పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తా మెలాంటి కొత్త రుణం తీసుకోలేద’ని పేర్కొనడం జరిగింది. కాగా జెట్ ఎయి ర్‌వేస్‌కు కొత్త రుణాలను మంజూరు చేసే విషయంలో ఎలాంటి స్వతంత్ర నిర్ణయాన్ని పీఎన్‌బీ తీసుకోలేదని ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సునీల్ మెహతా గురువారం స్పష్టం చేశారు. దీనిపై సమిష్టి నిర్ణయం కోసం కృషి జరుగుతోందని, వాటాదారుల అభిప్రాయాన్ని కూడా ఈ విషయంలో తీసుకునే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఫిక్సీ-ఐబీఏకి చెందిన ఓ కార్యక్రమంలో గురువారం నాడిక్కడ పాల్గొన్న సందర్భంగా విలేఖరులు అ డిగిన ప్రశ్నలకు మెహతా సమాధానాలిచ్చారు. బ్యాంకుల ఫోరం తీర్మాన ప్యా కేజీ ననుసరించే రుణ సహాయం ఉం టుందని ఈ సందర్భంగా ఆయన స్ప ష్టం చేశారు. బ్యాంకుల ఫోరంలోని అ న్ని బ్యాంకులు ఈ విషయంలో సం యుక్తంగా ఓ తీర్మానం చేయాల్సి ఉం టుందని, లీడ్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయం లో ఇతర భాగస్వాములతో సంప్రదింపులు సాగిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో దీనబంధు మొహాపాత్ర మాట్లాడుతూ జెట్‌ఎయిర్ వేస్‌కు సంబంధించిన తీర్మాన ప్రణాళికను అమలు చేసేందుకు ఇతర బ్యాంకులు సైతం మద్దతిస్తున్నాయన్నారు. ఆ వైమానిక సంస్థకు సంబంధించిన విలువలను కాపాడాల్సిన అవసరం కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. జెట్ ఎయిర్‌వేస్‌కు ప్రస్తుతం మొత్తం 8వేల కోట్ల రూపాయల అప్పులున్నాయి.