బిజినెస్

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 14: భారత స్టాక్ మార్కెట్ గురువారం ఎలాంటి భారీ పరిణామాలు లేకుండా ఫ్లాట్‌గా ముగిసింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి అత్యల్పంగా, కేవలం 2.72 పాయింట్లు (0.01 శాతం) పెరిగి, 37,754.89 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 1.55 పాయింట్లు (0.01 శాతం) పెరగడంతో, 11,343.25 పాయింట్లకు చేరింది. సెనె్సక్స్‌లో భారీగా లాభపడిన కంపెనీల జాబితాలో ఎన్‌టీపీసీ (3.53 శాతం), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (2.84 శాతం), సన్ ఫార్మా (2.41 శాతం), ఎస్ బ్యాంక్ (2.25 శాతం), కోల్ ఇండియా (2.03 శాతం) ఉన్నాయి. అదే విధంగా, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, వేదాంతా, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు ధర కూడా పెరిగింది. కాగా, హెచ్‌సీఎల్ టెక్ (2.11 శాతం), హీరో మోటోకార్ప్ (1.81 శాతం), టాటా మోటార్స్ (1.05 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (1.01 శాతం), పవర్‌గ్రిడ్ (0.66 శాతం) షేర్ల ధరలు పతనమయ్యాయి. వీటితోపాటు టీసీఎస్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) తదితర కంపెనీలు కూడా నష్టాలను ఎదుర్కొన్న సంస్థల జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల షేర్ల ధర సగటున 2.16 శాతం పతనమైంది. ఎన్‌ఎస్‌ఈ లావాదేవీల్లో ఎన్‌టీపీసీ (3.58 శాతం), ఇండస్‌ఇండ్ (2.78 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (2.43 శాతం), ఎస్ బ్యాంక్ (2.39 శాతం), సన్ ఫార్మా (2.17 శాతం) లాభాలను నమోదు చేశాయి. కాగా, హెచ్‌సీఎల్ టెక్ (2.17 శాతం), హీరో మోటార్స్ (1.81 శాతం), అల్ట్రాటెక్ (1.61 శాతం), టాటా మోటార్స్ (1.27 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (1.00 శాతం) నష్టాల బారిన పడ్డాయి. వివిధ రంగాల పరంగా చూస్తే, రియాల్టీ, మెటల్, టెలికాం, హెల్త్‌కేర్ సూచీలు లాభసాటిగా ముగిశాయి. ఐటీ, ఆటో, విద్యుత్ తదితర రంగాల సూచీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయి. రూపాయి మారకపు విలువ గురువారం మరికొంత బలపడింది. డాలర్ విలువ 69.51 రూపాయలుగా నమోదైంది. స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను ఎదుర్కోకుండా, కనీసం స్వల్ప లాభాల్లోనైనా ముగియడానికి రూపాయి మారకం విలువ పెరగడం కూడా ఒక కారణం. ఇలావుంటే, విదేశీ సంస్థాగత మదుపరులు 2,722.28 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేస్తే, దేశీయ మదుపరులు 1,508,14 కోట్ల విలువైన వాటాలను అమ్మేశారు. వివిధ దేశాల స్టాక్ మార్కెట్ సూచీలను పరిశీలిస్తే, ఆసియాలో హాంకాంగ్ మార్కెట్ 0.15 శాతం, కొరియా మార్కెట్ 0.34 శాతం చొప్పున లాభాలను ఆర్జించాయి. షాంఘై (చైనా) స్టాక్ మార్కెట్ సూచీ 1.20 శాతం పతనమైంది.