బిజినెస్

చమురు, గ్యాస్ నిక్షేపాల అమ్మకాలకు బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలోని తొమ్మిది కీలక చమురు, సహజ వాయువు నిక్షేపాల అమ్మకానికి బ్రేక్ పడింది. వీటి అమ్మకాన్ని అటు ఓఎన్‌జీసీ అధికారులతోపాటు, ఇటు ప్రభుత్వంలోని కొంత మంది ససేమిరా అనడంతో ప్రస్తుతానికి అమ్మకం ప్రతిపాదనను కేంద్రం విరమించుకున్నట్టు తెలుస్తోంది. ముంబయి హై, వసాయ్ ఈస్ట్‌సహా ఓఎన్‌జీసీకి చెందిన మొత్తం తొమ్మిది చమురు, గ్యాస్ ఫీల్డ్స్‌ను అమ్మేయ్యాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ గత ఏడాది ప్రతిపాదించారు. ప్రైవేటు లేదా విదేశీ సంస్థలకు ఈ నిక్షేపాలను అమ్మాలన్న తీర్మానాన్ని కేంద్రం ముందు పెట్టారు. ముంబయి హై, హీరా, డీ-1, వసాయ్ ఈస్ట్‌తోపాటు అస్సాంలోని పన్నా, గ్రేటర్ జొరాజన్, గెలెకీ, రాజస్థాన్‌లోని బఘేవాలా, గజరాత్‌లోని కలోల్ ఆయిల్ ఫీల్డ్‌ను కూడా ప్రైవేటు లేదా విదేశీ సంస్థలకు అమ్మాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువులో 95 శాతం ఓఎన్‌జీసీకి చెందిందే. మిగతా ఐదు శాతం వివిద ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్నది. కాగా, ఓఎన్‌జీసీకి చెందిన తొమ్మిది కీలక నిక్షేపాలను ప్రైవేటు లేదా విదేశీ సంస్థలకు అమ్మాలన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రతిపాదనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఈ ప్రతిపాదన లోపభూయిష్టంగా ఉందని, ఎన్నో అనుమానాలకు తావిస్తున్నదని ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీల నేతలు కొందరు కూడా ఇలాంటి అనుమానానే్న వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద, తొమ్మిది భారీ నిక్షేపాల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియకు ప్రస్తుతానికి తెరపడింది. కేంద్రం ఈ ప్రతిపాదనను పూర్తిగా విరమించుకుంటుందా? లేక మరోసారి తెరపైకి తెస్తుందా? అన్నది చూడాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడితే, ఓఎన్‌జీసీకి గడ్డుకాలం తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.