బిజినెస్

డబ్ల్యూపీఐ మాంద్యం 2.93 శాతం పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరి మాసంలో టోకు ధర సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత మాంద్యం 2.93 శాతం పెరిగింది. ఆర్థిక నిపుణులు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం, విద్యుత్ వంటి అత్యంత వౌలిక వస్తువుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను అనుసరించి, డబ్ల్యూపీఐ ఆధారిత మాంద్యం జనవరిలో 2.76 శాతంకాగా, ఫిబ్రవరిలో 2.93 శాతానికి చేరింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇది 2.74 శాతం మాత్రమే. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, వివిధ రకాలైన పండ్లు, పాలు తదితర ఆహారోత్పత్తుల ధర ఒక్క నెలలోనే 4.84 శాతం పెరగింది. జనవరిలో 3.54 శాతంగా ఉన్న పెరుగుదల ఫిబ్రవరిలో ఒక శాతానికి మించి ఉండడం గమనార్హం. ఇంధనం, విద్యుత్ సెగ్మెంట్‌లో మాంద్యం జనవరిలో 1.85 శాతంకాగా, ఫిబ్రవరి 2.23 శాతానికి పెరిగింది. వడ్డీ రేటును భారత రిజర్వు బ్యాంక్ 0.25 శాతం తగ్గించడం కూడా డబ్ల్యూపీఐ ఆధారిత మాంద్యం పెరుగుదలకు ఒక కారణమని అంటున్నారు.