బిజినెస్

బిఐఎఎల్‌లో ఫెయిర్‌ఫాక్స్‌కు జివికె వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (బిఐఎఎల్)లో 33 శాతం వాటాను అమ్మేస్తున్నట్లు జివికె పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సోమవారం తెలిపింది. 2,149 కోట్ల రూపాయలకు ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్ ఈ వాటాను దక్కించుకుంటోంది. ఈ లావాదేవీల అనంతరం సంస్థ రుణ భారం దాదాపు 2,000 కోట్ల రూపాయలు తగ్గుతుందని, ఏటా 300 కోట్ల రూపాయల వడ్డీ చెల్లింపుల నుంచి కూడా విముక్తి లభిస్తుందని జివికె తెలియజేసింది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ లావాదేవీ ముగుస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది.