బిజినెస్

ఐడీబీఐ పేరు మార్పుకు ఆర్బీఐ విముఖత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: పేరు మార్చాలన్న ఐడీబీఐ బ్యాంక్ ప్రతిపాదనకు ఆర్బీఐ విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ 51శాతం వాటాలను కొనుగో లు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని, ఐడీబీఐ బ్యాంక్ అనే పేరును ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంక్ లేదా ఎల్‌ఐసీ బ్యాం క్ అని మార్చేందుకు అనుమతించాలన్న ప్రతిపాదన ఆర్బీఐ ముందుకు వచ్చింది. అయితే, ఈ మార్పును ఆర్బీఐ స్వాగతించలేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ అనే పేరును మొదటి ప్రాధాన్యతగా పేర్కోగా, అది కుదరకపోతే, ఎల్‌ఐసీ బ్యాంక్ లిమిటెడ్ అనే పేరును ఖాయం చేయాలన్నది బ్యాంక్ ప్రతిపాదన. అయితే, బ్యాంక్‌ల పేరు మారాలంటే ఆర్బీఐతోపాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి కూ డా అవసరం. వాటాదారులు, స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాల్సి ఉం టుంది. సహజంగా, ఆర్బీఐ ఆమోద ముద్ర వేస్తే, మిగతావి లాంఛనంగా మారుతాయి. కానీ, ఆర్బీఐ ఈ ప్రతిపాదనకు సానుకూలంగా లేదని స మాచారం. దీనితో ఇతరత్రా ఆమోదా ల కోసం ఐడీబీఐ బ్యాంక్ ప్రయత్నించేందుకు వీలు ఉండదు. గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన ఈ ఆర్థిక సం వత్సరం మూడో త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్ సుమారు రూ.4,185.48 కోట్ల మేర నష్టాలను ఎదుర్కొంది. ఇచ్చిన రుణాలు సరిగ్గా వసూలు కాకపోవడమే ఈ పరిస్థితికి కారణం. గత ఏడాది మూడో త్రైమాసికంలో బ్యాం క్ ఆదాయం రూ.7,125.20 కోట్ల రూపాయలుకాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో, అదే సమయానికి 6,190.31 రూపాయలకు పతనమైంది.