బిజినెస్

గోవా మైనింగ్ పునరుద్ధరణ ఎప్పుడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, మార్చి 18: గోవాలో ఇనుమ ఖనిజ తవ్వకాలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయన్న ప్రశ్న స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నది. వేలాది మందికి ఇక్కడి మైనింగే ఆధారం. గత ఏడాది మార్చి మాసంలో ఇనుప ఖనిజ మైనింగ్‌ను నిలిపివేసిన మైనింగ్ మంత్రిత్వ శాఖ, ఇప్పటి వరకూ దాని పునరుద్ధరణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గోవా మైనింగ్ పీపుల్స్ ఫ్రంట్ (జీఎంపీఎఫ్) పేరుతో ఏర్పడిన సంస్థ మైనింగ్‌ను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. 88 మైనింగ్ కంపెనీల లైసెన్సులను పొడించరాదని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించి, గోవాలో ఐరన్ ఓర్ మైనింగ్‌ను నిలిపివేశారు. అయితే, ప్రస్తుత చట్టంలో కొన్ని సవరణలు చేయడం ద్వారా మైనింగ్‌ను పునరుద్ధరించే అవకాశం ఉందని జీఎంపీఎఫ్ వాదిస్తున్నది. మైనింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి పరిమళ్ రాయ్‌కు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించింది. సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని, గోవా, డామన్, డయూలను మైనింగ్ నిబంధనల నుంచి మినహాయించాలని కోరుతున్నది. ఇలావుంటే, మైనింగ్‌ను మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల వారు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 1987 మైనింగ్ చట్టాన్ని మార్చాలని, గోవాకు మినహాయింపు ఇవ్వాలని వారి డిమాండ్. పలు ప్రాంతాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రదర్శనలు ఒక్కోసారి హింసాత్మకంగా మారుతున్నాయి. మైనింగ్‌ను పునఃప్రారంభించేందుకు అవసరమైన మినహాయింపులు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో గోవా సర్కారు పిటిషన్‌ను దాఖలు చేయాలని మైనింగ్‌పై ఆధారపడిన కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, అటు గోవా సర్కారుగానీ, ఇటు కేంద్ర ప్రభుత్వంగానీ గోవాలో మైనింగ్ అంశంపై స్పందించడం లేదు. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో, ఇప్పట్లో ఈ సమస్యకు తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందనే అంశంపైనే గోవాలో మైనింగ్ తిరిగి ప్రారంభం కావడం లేదా ఇదే పరిస్థితి కొనసాగడం అనేది ఆధారపడి ఉంటుంది.