బిజినెస్

ఆ నిర్ణయం కంపెనీకి ముప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: ప్రముఖ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీని టేకోవర్ చేసుకునేందుకు లార్సన్ అండ్ టుబ్రో బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు రావడం పట్ల ఆ కంపెనీ ప్రమోటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైండ్‌ట్రీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల కంపెనీ మనుగడకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. తమ యాజమాన్యం తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయాన్ని తాము తిప్పికొడతామని మైండ్‌ట్రీ ప్రమోటర్లు వ్యాఖ్యానించారు. 3లార్సన్ అండ్ టుబ్రో యాజమాన్యం తీసుకున్న అసాధారణ నిర్ణయం మా పరిశ్రమను దెబ్బతీయడమే అవుతుంది. గత 20 ఏళ్లుగా మా సిబ్బంది అంతా సమష్టిగా, బలంగా నిలబెట్టిన సంస్థను ఉన్నఫళంగా వేరొకరికి దారాధత్తం చేసేందుకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల సంస్థ మనుగడపై తీరని ప్రభావం చూపుతుంది2 అని మైండ్‌ట్రీ ఐటీ కంపెనీకి చెందిన పలువురు ప్రమోటర్లు అభిప్రాయపడ్డారు. తమ సంస్థ యాజమాన్యం తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయాన్ని తమ ప్రమోటర్లమంతా ముక్తకంఠంతో నిరసిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణకుమార్ నటరాజన్, కో-్ఫండర్ సుబ్రతో బాగ్చి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోస్టోవ్ రావణన్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ అండ్ సీఓఓ పార్థసారథి తదితరులు ఒక ప్రకటనలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల కార్పొరేట్ సంస్కృతి దెబ్బతినడంతోపాటు క్లయింట్ రిలేషన్‌షిప్స్, ఉద్యోగుల నిలుపుదల తదితర అంశాల్లో ప్రతికూల వాతావరణ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తమ యా జమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ప్రమోటర్లుగా తాము పూర్తిగా వ్యతిరేకించడంలేదని, అదే దశలో సంస్థలోని అందరు ప్రమోటర్లకు మేలు చేకూర్చేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకునే దిశగా యాజమాన్యం ముందుకు సాగుతుందని తాము బలంగా విశ్వసిస్తున్నామని వారు అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల వాటాదార్లకు నష్టం కలుగకుండా ఉండేందుకే తాము సంస్థను టేకోవర్ చేసే అంశాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తున్నామని వారు తెలిపారు. ఇదిలావుండగా, దేశంలో ఐటీ సెక్టార్ విభాగంలో గత కొనే్నళ్లుగా కొనసాగుతున్న మైండ్‌ట్రీ సంస్థ తొలిసారిగా దేశీయ వౌలికరంగ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో 66 శాతం వాటాతో అంటే 10,800 కోట్ల రూపాయలతో దక్కించుకునేందుకు బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు వచ్చింది. అదేవిధంగా మైండ్‌ట్రీలో కాఫీ డే యజమాని వీజీ సిద్దార్థకు చెందిన 20.32 శాతం వాటాను కూడా దక్కించుకునేందుకు డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమైంది.