బిజినెస్

ఏడో రోజూ స్టాక్‌మార్కెట్ల కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఏడోరోజు స్టాక్‌మార్కెట్ కళకళలాడుతోంది. మంగళవారం బీఎఎస్‌సీ సెనె్సక్స్ అమాంతం 268 పాయింట్లు లాభపడగా, అదే సమయంలో నిఫ్టీ కూడా 11,500 పాయింట్ల దగ్గర స్థిరపడింది. గడచిన కొద్దిరోజులుగా విదేశీ పెట్టుబడులు పెరుతుండడంతో ఐటీసీ, ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్ వంటి రంగాలు లాభపడ్డాయి. కొనుగోళ్ల అండతో సూచీలు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 38,218.59 పాయింట్లతో ప్రారంభమైన ఇండెక్స్ ఒకదశలో 38,396.06 వరకు వెళ్లింది. చివరకు 38,363.47 పాయింట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇండెక్స్ 268.40 పాయింట్లు లేదా 0.70 శాతం వద్ద ముగిసింది. అదేవిధంగా ఇంట్రాడే కూడా 38,078.23 పాయింట్ల వద్ద స్థిరపడింది. గడిచిన ఆరు సెషన్స్‌లో ఇంట్రాడే 1,420 పాయింట్లకు ఎగబాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 50 పాయింట్లు ఎగబాకి 11,509.55 పాయింట్ల వద్ద నిలిచింది. అత్యధికంగా 70.20 పాయింట్లు లేదా 0.61 శాతంతో 11,543.85, 11,451.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత ఏడాది సెప్టెంబర్ 7 నుంచి చూసుకుంటే సెనె్సక్స్, నిఫ్టీ అత్యధిక పాయింట్లను తాకి స్థిరపడ్డాయని మళ్లీ ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇక పబ్లిక్ సెక్టార్ యూనిట్లు అయిన ఆయల్ అండ్ గ్యాస్, ఇన్‌ఫ్రాస్టక్చర్, రియాలిటీ, బ్యాంకింగ్, విద్యుత్ సెక్టార్ల షేర్లు బాగా లాభపడ్డాయి. దేశీయ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడిదారుల సానుకూల కారణంగా ఏడోరోజు స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. వచ్చే నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సెంటిమెంటును అనుసరించి మళ్లీ కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయన్న సంకేతాల నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.